Home > టెక్నాలజీ > ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టిన మెటా

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టిన మెటా

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టిన మెటా
X

ఫేస్ బుక్, వాట్సాప్ ల యాజమాన్య సంస్థ మెటా మొన్న థ్రెడ్ అంటూ మైక్రో బ్లాగింగ్ లోకి అడుగు పెట్టింది. ఇప్పుడేమో ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్ లోకి దూసుకువచ్చింది. చాట్ జీపీటీ, గూగుల్ లకు పోటీగా ఏఐ మోడల్ ను తీసుకువచ్చింది. పైగా ఇందులో ఫ్రీ వెర్షన్ ను విడుదల చేసింది.

చాట్ జీపీటీ, బార్డ్, బాట్ బాట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. దీనిని ఎవరైనా వాడుకోవచ్చును. నేరుగా ఎక్సస్ చేసుకోవచ్చు కూడా. మన సృజన, నైపుణ్యాలను ఈ ఏఐ టెక్నాలజీలతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చును. అయితే ఇప్పుడు మెటా తీసుకువచ్చిన ఏఐ వెర్షన్ ఇందుకు భిన్నంగా ఉంది. జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా రిసెర్చర్లకు వీలుగా ఉండేలా లామా అనే లాంగ్వేజ్ టూల్ ను అభివృద్ధి చేసింది మెటా. ఇదొక ఓపెన్ సోర్స్ అని చెబుతోంది మెటా. మిగతా వాటిలా కాకుండా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులను కూడా వినియోగించుకోవచ్చును. వాటిని సవరించే వీలు కూడా ఉంటుంది.

ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుంది లామా. ఇది చాలా మంది డెవలపర్‌లకు కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ చెబుతున్నారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అందరికీ అందుబాటులో ఉంచడం వలన దానిని ఎక్కువ మంది పరిశీలించి... సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకునేలా మెటా ఏఐ మోడల్‌ సరికొత్త, శక్తివంతమైన వెర్షన్‌ లామా 2 అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.



Updated : 19 July 2023 11:31 AM IST
Tags:    
Next Story
Share it
Top