Home > టెక్నాలజీ > Mobile Prices : కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు

Mobile Prices : కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు

Mobile Prices : కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు
X

(Mobile Prices) మొబైల్ ఫోన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్‌లో వినియోగించే విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

అదేవిధంగా మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇండియాలో ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరింత ఊరట కలగనుంది. మరోవైపు దిగుమతి సుంకం తగ్గడంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. తాజాగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదికలో స్మార్ట్ ఫోన్ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించొచ్చని కేంద్రం తెలిపింది. దీనిద్వారా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది.


Updated : 1 Feb 2024 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top