Home > టెక్నాలజీ > వారెవ్వా.. డాక్టర్లు కనిపెట్టలేనిది..చాట్జీపీటీ కనిపెట్టేసింది..

వారెవ్వా.. డాక్టర్లు కనిపెట్టలేనిది..చాట్జీపీటీ కనిపెట్టేసింది..

వారెవ్వా.. డాక్టర్లు కనిపెట్టలేనిది..చాట్జీపీటీ కనిపెట్టేసింది..
X


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. అన్నీ రంగాలకు ఇది క్రమంగా విస్తరిస్తోంది. ఏఐతో ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నారు. నష్టాలు పక్కనబెడితే దీన్ని వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు చెప్పలేనివి సైతం చాట్ జీపీటీ చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఓ తల్లి అన్వేషణకు చాట్ జీపీటి పరిష్కారం చూపించింది.

కోర్ట్నీ అనే మహిళకు అలెక్స్ అనే 4ఏళ్ల కొడుకు ఉన్నాడు. కరోనా వ్యాప్తి వేళ అతడు ఓ జబ్బు బారిన పడ్డాడు. పంటి నొప్పి, ఎత్తు పెరగకపోవడం వంటి లక్షణాలు బాబులో కన్పించాయి. ఎక్కడికి వెళ్లిన బాబు సమస్యకు పరిష్కారం దొరకలేదు. కనీసం అది ఏం వ్యాధో కూడా కనిపెట్టలేకపోయారు. మూడేళ్లలో 17మంది డాక్టర్లను ఆమె కలిసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కోర్ట్నీ ఆందోళన చెందింది.

ఓ రోజు ఏం చెయాలో చాట్ జీపీటీని సాయం అడిగింది. ఎంఆర్‌ఐ రిపోర్డులో ఉన్న ప్రతి అంశం గురించి చాట్‌జీపీటీని వివరంగా అడిగింది. అలాగే తన బిడ్డకున్న లక్షణాలు పంచుకుంది. ఎట్టకేలకు టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్‌తో తన కొడుకు బాధపడుతున్నట్లు చాట్జీపీటీ చెప్పింది. వెంటనే న్యూరోసర్జన్‌ను కలిసి తన కొడుకు టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ డాక్టర్‌ అలెక్స్‌ జబ్బుని నిర్థారించి చికిత్స చేశారు. దీంతో తన కొడుకు జబ్బు నుంచి కోలుకున్నాడని.. కొంచెం ఎత్తు పెరిగాడని కోర్ట్నీ చెప్పింది. చాట్జీపీటీ వల్ల తన కొడుకు అనారోగ్యం నయమైందని సంతోషం వ్యక్తం చేసింది.


Updated : 12 Sept 2023 10:54 PM IST
Tags:    
Next Story
Share it
Top