Moto G34 5G Offer: భారీ తగ్గింపుతో న్యూ మొబైల్స్‌ను లాంచ్ చేసిన మోటరోలా ..డిస్కౌంట్ వివరాలు ఇవే!
X
ప్రముఖ మోబైల్ కంపెనీ మోటరోలా తన న్యూ బ్రాండ్ G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Moto G34 5G (Moto G34 5G) పేరుతో లాంచ్ చేసిన ఈ పోన్ ఫ్యూచర్స్ ఆకట్టకుంటున్నాయి. ఇక ఏడాదిలో మోటో కంపెనీ లాంచ్ చేసిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా ఇండియాలో విడుదలైన ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉందో చూద్దాం.
Moto G34 5G ధర, ఫీచర్లు
Moto G34 5G ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఇచ్చారు. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ గల ఫోన్ 10,999. ఉండగా.. 8GB RAM + 128GB స్టోరేజ్‌తో కూడిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 11,999గా ఉంది. ఈ ఫోన్ కలర్స్ విషయానికి వస్తే చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ, ఓషన్ గ్రీన్ లభిస్తుంది. జనవరి 17 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడుతుంది. అలాగే ఎంపిక చేసిన రీటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో) Moto G34 5G ఆండ్రాయిడ్ 14 వర్షన్‌తో రన్ అవుతుంది. త్వరలో ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే హ్యాండ్‌సెట్‌కు మూడు సంవత్సరాల సెక్యూరిటి వారంటీని అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉండగా.. 8GB RAMతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ఫీచర్‌ను అందించారు.
మెమరీని 16GB వరకు విస్తరించవచ్చు.
కెమెరా విషయానికి వస్తే, బ్యాక్ కెమెరా సెటప్‌తో కలిగి ఉంటుంది, ఇది f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు ఆదనంగా f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అందించారు. ఈ 5G స్మార్ట్ ఫోన్‌లో 128GB UFS 2.2 ఆన్ బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంది, దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.
Moto G34 5G ఫోన్ 20W TurboPower ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 802.11, బ్లూటూత్, FM రేడియో, GPS/A-GPS, 3.5mm హెడ్ ఫోన్ జాక్‌తో పాటు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.