Home > టెక్నాలజీ > Moto e13: ఆ ఫీచర్లేంటి భయ్యా.. మరీ ఇంత తక్కువ ధరలోనా..

Moto e13: ఆ ఫీచర్లేంటి భయ్యా.. మరీ ఇంత తక్కువ ధరలోనా..

Moto e13: ఆ ఫీచర్లేంటి భయ్యా.. మరీ ఇంత తక్కువ ధరలోనా..
X

బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కోసం మోటరోలా సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. మోటో ఈ13 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో ఈ మొబైల్ విడుదల కానుంది. ఆగస్టు 16 నుండి మోటోరోలా వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్.. ఈ మూడు రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఏఐ పవర్డ్ కెమెరా, ఆటో స్మైలింగ్ క్యాప్చర్ తో వస్తుంది. ఫేస్ బ్యూటీ , పోర్ట్రెయిట్ మోడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. ఫొటో లవర్స్ కు ఈ ఫోన్ ప్రత్యేకం కానుంది. కాగా, ఈ ఫోన్ రూ. 8,999కు అందుబాటులో ఉంటుందని మోటో తెలిపింది.

మోటో ఈ13 స్పెసిఫికేషన్స్‌:

6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే, UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఈ ఫోన్ కు ప్లస్ పాయింట్స్. అంతేకాకుండా ఇది ప్రీమియం యాక్రిలిక్ గ్లాస్ (PMMA) బాడీ, డాల్బీ ఆట్మోస్ ఆడియోతో వస్తుంది. వీటితో పాటు 13 ఎంపీ ఏఐ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ కెపాసిటీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తుంది.








Updated : 14 Aug 2023 7:14 PM IST
Tags:    
Next Story
Share it
Top