Home > టెక్నాలజీ > చందమామపై మనుషులు నివసించే కాలనీ నిర్మాణం...ఎక్కడో తెలుసా?

చందమామపై మనుషులు నివసించే కాలనీ నిర్మాణం...ఎక్కడో తెలుసా?

చందమామపై మనుషులు నివసించే కాలనీ నిర్మాణం...ఎక్కడో తెలుసా?
X

చంద్రయాన్ 3 విజయంతో విశ్వమంతా చంద్రుడివైపే చూస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, చందమామై నివసించాలనే కోరికతో ఇప్పటికే చాలా మంది బడా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు , ప్రజలు చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో చందమామై కాలనీని నిర్మించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది. మరి ఈ కాలనీ ఎక్కడ నిర్మించాలి? మానవాళికి ఏ ప్రాంతం సేఫ్? కాలనీ నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ఏ ప్రదేశంలో అధికంగా ఉంది? అక్కడి ఉష్ణోగ్రతలు మనుషులకు అనుకూలంగా ఉంటుందా? ఇలా ఈ అంశాలు అన్నింటిని పరిశీలించి శాస్త్రవేత్తలు ఓ ప్రదేశాన్ని కాలనీ నిర్మాణానికి ఎంపిక చేశారు. మరి అది ఏ ప్రాంతమో మనమూ తెలుసుకుందాం పదండి.

చందమామ దక్షిణ ధృవానికి దగ్గర్లో ఉన్న అయిట్కెన్ బేసిన్‎లో మనుషుల నివాసానికి అనుగుణంగా ఓ కాలనీని నిర్మించాలని నాసా , చైనా ఆస్ట్రానమర్స్ యోచిస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా ఇస్రో కూడా తన అడుగులనున అటువైపే వేస్తోంది. అయిట్కెన్ బేసిన్ అనేది అతి పెద్ద గొయ్యి. అంటే ఓ పెద్ద లోయ లాంటిది. దీని రేడియస్ 2500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 8.2 కిలోమీటర్ల లోతులో అయిట్కెన్ బేసిన్ ఉంది.

ఈ లోయ ఏర్పడి దాదాపు 420 కోట్ల సంవత్సరాలు అయ్యి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడినప్పుడే ఈ లోయ ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో జాబిల్లిపై ప్రజలు జీవించడానికి ఇది అనుకూలమైన ప్రదేశంగా ఖగోల శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లోయలోనే పర్వతాలు ఉన్నాయట. సూర్యుడి వేడిమి నంచి ఇవా మనుషులను కాపాడతాయట. అందుకే ఈ ప్రాంతం మనుషులు నివసించేందుకు సురక్షితమైన ప్రదేశంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే చైనా స్పేస్‌క్రాఫ్ట్ ఛేంజ్ 4, 2019 జనవరి 3న అయిట్కెన్ బేసిన్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ లోయలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అనౌన్స్ చేశారు. ఐరన్, టైటానియం, థోరియం నిల్వలు ఉన్నాయని నాసా అంచనా కూడా వేస్తోంది. అంతే కాదు ఇనుముతో ఉన్న సున్నపురాతి చెరువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బట్టి చూస్తే కాలనీని నిర్మించేందుకు కావాల్సిన అన్ని రకాల మెటీరియల్ మొత్తం ఈ లోయలోనే ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఒక్కటిగా ఈ ప్రాంతంలో ఒక కాలనీని నిర్మించుకోవచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెస్టినేషన్ మూన్ వీడియోలో కూడా తెలిపింది . ఈ ప్రాంతంలో గుండ్రంగా ఉన్న రిమ్‌లో ఎత్తైన పర్వతాలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిపై ఎప్పుడూ ఎండ ఉంటుంది. ఈ కారణంతో అక్కడ కాలనీని ఏర్పరుచుకోవచ్చని ESA తాజాగా చెబుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రోవర్లు, ఆ తర్వాత మనుషుల్ని అక్కడికి పంపాలని భావిస్తోంది.

Updated : 4 Sept 2023 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top