Home > టెక్నాలజీ > Chandrayaan-3: అందరాని చందమామపై.. మన రాజ ముద్ర

Chandrayaan-3: అందరాని చందమామపై.. మన రాజ ముద్ర

Chandrayaan-3: అందరాని చందమామపై.. మన రాజ ముద్ర
X

ప్రపంచ మేటి దేశాలకు సాధ్యం కాని ఘనతను.. భారత్ చేసి చూపించింది. మీ వల్ల కాదంటూ.. విమర్శించిన వాళ్ల నోట వేలేసుకునేలా చేసింది. చరిత్రలో ఎవరూ సాహసించని, చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 కాలు మోపింది. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ చేసి సంచలనం సృష్టించింది. జాబిల్లిపై సరికొత్త అధ్యాయనాన్ని లిఖించింది. ల్యాండింగ్ పూర్తయిన 4 గంటల తర్వాత ల్యాండర్ ర్యాంప్ బయటికి వస్తుంది. అందులో నుంచి 6 చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా చంద్రుడిపై దిగుతుంది.

ఆ తర్వాత సెకనుకు సెంటీమీటర్ వేగంతో చంద్రుడిపై కదులుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపైనే ఉండి పరిశోధనలు చేస్తాయి. అయితే, ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన చక్రాలపై నాలుగు సింహాలతో కూడిన జాతీయ చిహ్నం ముద్రతో పాటు ఇస్రో లోగోను ఉంచారు సైంటిస్ట్లు. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తిరుగుతున్నప్పుడు టైర్లపై ఉన్న రాజ ముద్రలు ఉపరితలంపై పడనున్నాయి. దీంతో మన జాతీయ చిహ్నం, ఇస్రో గుర్తులు జాబిల్లిపై చెదిరిపోకుండా ఎప్పటికీ అలానే నిలిచిపోనున్నాయి.

NOTE: పబ్లిష్ చేసిన చిత్రాలన్నీ ఊహాత్మకమైనవి. సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పోస్ట్ చేసుకున్న వాటినుంచి తీసుకున్న చిత్రాలు. ఈ చిత్రాలను ఇస్రో అధికారిక విడుదల చేయలేదు.


Updated : 23 Aug 2023 3:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top