Home > టెక్నాలజీ > నెట్ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. పాస్వర్డ్ షేరింగ్ బంద్

నెట్ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. పాస్వర్డ్ షేరింగ్ బంద్

నెట్ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. పాస్వర్డ్ షేరింగ్ బంద్
X

తమ యూజర్లకు నెట్ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. పాస్వర్డ్ షేరింగ్ను నిలిపివేసినట్లు ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వ్యక్తి యొక్క కుటుంబసభ్యులకు మాత్రమే పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్‌ కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమ యూజర్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి షోలు, సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.

పాస్వర్డ్ షేరింగ్ విషయంపై నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. గత నెల నెట్‌ఫ్లిక్స్ ఆశించిన లాభాలను రాబట్టుకోలేదు. దీంతో యూజర్ షేరింగ్ పాస్‌వర్డ్‌లపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సుమారు 100 దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ సౌకర్యాన్ని ఎత్తేసింది. . మరోవైపు పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో దాదాపు 60 లక్షల మంది కొత్త యూజర్లు చేరినట్లు సంస్థ తెలిపింది.




Updated : 20 July 2023 2:20 PM IST
Tags:    
Next Story
Share it
Top