Home > టెక్నాలజీ > కొత్త కలర్ వేరియంట్లో ఒప్పో ఎఫ్25 ప్రో.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయయండి

కొత్త కలర్ వేరియంట్లో ఒప్పో ఎఫ్25 ప్రో.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయయండి

కొత్త కలర్ వేరియంట్లో ఒప్పో ఎఫ్25 ప్రో.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయయండి
X

ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది. ఫిబ్రవరి 29న ఒప్పో ఎఫ్25 ప్రో ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ను ఒప్పో రివీల్ చేసింది. రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తున్న ఈ ఫోన్ లోని పీచ్ కలర్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ తో వస్తుంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో, ఫ్రంట్ 32ఎంపీ కెమెరాలు ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్.

5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్‌ వూక్ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ రెండు వేరియంట్‌ల్లో వస్తుంది. దీని ధర రూ. 22,999, రూ.24,999 ఉండనుంది. బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌కు పొందొచ్చు. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ తో పాటు.. అన్ని ఒప్పో ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులోకి వస్తుంది.

Updated : 25 Feb 2024 9:07 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top