NASA : ఆడియన్స్ గెట్ రెడీ..మార్కెట్లో కొత్త OTT
X
కరోనా లాక్డౌన్ సమయంలో లాభపడింది ఎవైనా ఉందా అంటే అవి ఒక్క OTTలే. ప్రజలంతా ఆ సమయంలో ఇళ్లకే పరిమితం కావడంతో OTTలకు బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని బయటికి వెళ్లే అవసరం లేకుండా ఇంటిపట్టునే అందించి OTTలు టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఆహా , జీ5, డీస్నీ + హాట్‌స్టార్ , సోని లీవ్ ఇలా రకరకాల OTT ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయిజ. కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలతో సబ్‌స్క్రైబర్స్ సంఖ్యను పెంచుకొంటున్నాయి. ప్రస్తుతం OTTలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో మరో కొత్త OTT ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( NASA) త్వరలో ఓ కొత్త OTTతో మార్కెట్లోకి రాబోతోంది.
నాసా కొత్తగా OTT ప్లాట్ఫామ్లో తన సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. NASA+ పేరుతో వచ్చే ఏడాది మార్కెట్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది.
ఈ OTT ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు, నాసా టాక్స్, నాసా కిడ్స్, నాసా ఎక్స్‌ప్లోరర్స్, నాసా స్పేస్ ప్రోగ్రామ్స్, సైన్స్ కు సంబంధించిన అనే కార్యక్రమాలను స్ట్రీమింగ్ చేయనుంది. వీటితో పాటే వెబ్ సిరీస్‌లు , స్పెషల్ ఈవెంట్లు, స్పోర్ట్స్, న్యూస్, లైవ్ ఈవెంట్ కవరేజిలు ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యింది.NASA+, యాపిల్, గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఇతర వెబ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని నాసా తెలిపింది.