శామ్ సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్లు
X
భారత్‌లో శామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించింది. తాజాగా వాటి ధరలతో పాటు పూర్తి ఫీచర్లను వెల్లడించింది.రెండింటిలోనూ 50 ఎంపీ ఓఐఎస్ మెయిన్, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఏ55లోసెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుండటం విశేషం. ఇందులో.. లో- లైట్ ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.సామ్సంగ్ గెలాక్సీ ఏ35లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ దీని సొంతం.
మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వి.. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. దీనికి.. నాక్స్ 3.1 ప్రొటెక్షన్ లభిస్తోంది. సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్‌పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్ని సంస్థ ఇస్తుంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.