Home > టెక్నాలజీ > రయ్ రయ్... రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేసింది

రయ్ రయ్... రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేసింది

రయ్ రయ్... రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేసింది
X


ఎన్ని మోడల్ బైక్స్ ఉన్నా.. అందులో మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలున్నా.. బుల్లెట్ బండి క్రేజే వేరు. బుల్లెట్‌ను చాలామంది తమ హుందాతనంగా భావిస్తుంటారు. అలాంటి బుల్లెట్ లవర్స్ కి ఇది కచ్చితంగా గుడ్ న్యూసే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. తన కొత్త బుల్లెట్‌ 350ని (Royal enfield bullet 350cc 2023) మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.1,73,562 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో వస్తున్న ఈ మోటార్‌ సైకిల్‌ బుకింగ్స్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. డెలివరీలు రేపటి(సెప్టెంబర్‌ 3) నుంచి ప్రారంభంకానున్నాయి.

మిలిటరీ, స్టాండర్డ్, గోల్డ్ పేరుతో మూడు వేరియంట్స్‌తో ఈ బుల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. బుల్లెట్ 350 మిలిటరీ వేరియంట్ ధర రూ.1,73,562 కాగా, బుల్లెట్ 350 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,97,436. ఇక హైఎండ్ వేరియంట్ బుల్లెట్ 350 గోల్డ్ వేరియంట్ ధర రూ.2,15,801. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. హోండా సీబీ350, జావా ఫార్టీటూ లాంటి 350సీసీ మోటార్ సైకిల్స్‌కు బుల్లెట్ 350 గట్టి పోటీ ఇవ్వనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫీచర్స్ చూస్తే ఇందులో 349సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. గరిష్టంగా 20.2 bhp శక్తిని, 27Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో 5 -స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ మోడల్ పాత క్లాసిక్ బుల్లెట్ 350 లాగానే స్టైలింగ్‌ ఉండటం విశేషం. ఈ 350 మోడల్‌లో రీడిజైన్ చేసిన హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్‌తో రిఫ్రెష్ డిజైన్‌ను చూడొచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మిలిటరీ రెడ్, మిలిటరీ బ్లాక్, స్టాండర్డ్ మెరూన్, స్టాండర్డ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్‌లో ఎల్‌సీడీ స్క్రీన్, సరికొత్త హ్యాండిల్ బార్, స్విచ్ గేర్, యూఎస్‌బీ పోర్ట్‌తో కూడిన కొత్త డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి.

ఇందులో ఎంట్రీ-లెవల్ వేరియంట్ సింగిల్-ఛానల్ ABS ఉంది. వెనుక డ్రమ్ బ్రేక్‌లు, సింగిల్ సాలిడ్-కలర్ ట్యాంక్స్, మిడిల్ రేంజ్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సరికొత్త బుల్లెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 3 నుంచి డెలివరీస్ ప్రారంభం అవుతాయి.


Updated : 2 Sept 2023 9:28 AM IST
Tags:    
Next Story
Share it
Top