Home > టెక్నాలజీ > రేపే నథింగ్ ఫోన్ 2 లాంచ్.. ధర ఎంతంటే.. ?

రేపే నథింగ్ ఫోన్ 2 లాంచ్.. ధర ఎంతంటే.. ?

రేపే నథింగ్ ఫోన్ 2 లాంచ్.. ధర ఎంతంటే.. ?
X

లండన్కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ నథింగ్.. తన రెండవ ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. గతేడాది నథింగ్ 1 పేరిట తన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయగా అది సూపర్ సక్సెస్ అయ్యింది. మంగళవారం నథింగ్ ఫోన్ 2 ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ ఇప్పటికే ప్రకటించగా.. మిగితా స్పెసిఫికేషన్లపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.

నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్ 8+Gen 1 SoC ప్రాసెసర్‌తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 6.7 ఇంచెస్ HD+ డిస్‌ప్లే సహా 4,700mAh బ్యాటరీ ఉంటుందని వివరించింది. అయితే మరికొన్ని స్పెసిఫికేషన్ల గురించి సోషల్ మీడియాలో జోరు చర్చ నడుస్తోంది. ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 మెయిన్ కెమెరాతో పాటు 50MP శాంసంగ్ ఐఎస్ఓసెల్ జేఎన్1 అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

రెండు వేరియంట్లలో..

నథింగ్ ఫోన్ 2 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని సమాచారం. 120Hz రిఫ్రెష్ రేట్ దీని సొంతం. 2400*1080 పిక్సల్స్ రిజల్యూషన్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సెట్ అప్ ఉంటుంది. రెండు వేరియంట్లు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రెండవది 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఇక ఈ నథింగ్ ఫోన్ 2 వైట్, డార్క్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.

ధర ఎంతంటే..?

కొన్ని లీకుల ప్రకారం మన దేశంలో నథింగ్ ఫోన్ 2 ప్రారంభ వేరియంట్ ధర సుమారు రూ. 42,000 లేదా రూ. 43,000 లుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జులై 11న లాంచ్ అవుతున్న ఈ ఫోన్.. 14 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ వైట్, డార్క్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Updated : 10 July 2023 4:15 PM IST
Tags:    
Next Story
Share it
Top