Home > టెక్నాలజీ > Ola Electric Bike : ఓలా నుంచి కొత్త స్కూటర్ లాంచ్.. 8 ఏళ్ల వారెంటీతో బ్యాటరీ

Ola Electric Bike : ఓలా నుంచి కొత్త స్కూటర్ లాంచ్.. 8 ఏళ్ల వారెంటీతో బ్యాటరీ

Ola Electric Bike : ఓలా నుంచి కొత్త స్కూటర్ లాంచ్.. 8 ఏళ్ల వారెంటీతో బ్యాటరీ
X

(Ola Electric Bike) ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన ఓలా మరో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. S1X మోడల్‌లో 4kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ధరను రూ.1.09 లక్షలుగా ఓలా నిర్ణయించింది. సింగిల్ ఛార్జ్‌తో 190 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని ఓటా వెల్లడించింది. ఈ ఓలా స్కూటర్‌లో 6kw మోటర్‌ను అమర్చినట్లు తెలిపింది. కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. టాప్ స్పీడ్ చూసినట్లైతే 90 కిలోమీటర్ల వరకూ ఉంది.





ఫీచర్లు ఇవే

కొత్తగా మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్ వెలాసిటీ, మిడ్ నైట్, వోగ్, స్టీలర్, పోర్స్ లెయిన్ వైట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో లభించనుంది. అయితే ఏప్రిల్ నెల నుంచి ఇవి డెలివరీలు కానున్నాయి. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 10.9 సెంటీమీటర్ల డిస్‌ప్లేను అమర్చారు. ఫిజికల్ కీ అన్‌లాక్ సిస్టమ్ ఉంది. అయితే ఇందులో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఏవీ ఉండవని ఓలా తెలిపింది. ఈ మోడల్ యువతను ఎంతగానో ఆకట్టుకోనుంది.





బ్యాటరీకి 8 ఏళ్ల వారెంటీ

ఓలా తమ వినియోగదారుల కోసం కొత్త వారెంటీ సదుపాయాన్ని తెచ్చింది. ఈవీ బ్యాటరీ విషయంలో అందరి అనుమానాలకు తెరదించుతూ ఓలా సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకూ ఎక్స్‌టెండెడ్ వారెంటీని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. అన్ని వాహనాలకు వారెంటీ వర్తిస్తుందని ఓలా వెల్లడించింది. ఇకపోతే ఓలాకు దేశవ్యాప్తంగా 414 సర్వీస్ సెంటర్లు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆ సంఖ్యను 600కు పెంచనున్నట్లు తెలిపింది.






Updated : 3 Feb 2024 11:24 AM IST
Tags:    
Next Story
Share it
Top