జీరో డౌన్ పేమెంట్తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ
X
Thumb : ముందు కొనండి.. తర్వాత కట్టండి
వాహన ప్రియులకు ఓలా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో డౌన్ పేమెంట్ తో ఎలక్ట్రిక్ స్కూటీని సొంతం చేసుకోవచ్చని ప్రకటిచింది. పైగా అతితక్కువ వడ్డీకే ఈ ఆఫర్ అందిస్తున్నట్లు చెప్పింది. దీనికోసం ఐడీఎఫ్సీ, ఎల్ అండ్ టీ సంస్థలతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ బైక్స్‌కు అందించే ఫేమ్-2 సబ్సిడీలో కోత పెట్టింది. దీంతో వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఈ తరుణంలో వాహనాల సేల్స్‌ను పెంచేలా ఓలా తన ప్రత్యర్ధి సంస్థ ఎథేర్ అందిస్తున్నట్లుగానే ఎస్10 రేంజ్ వాహనాల్ని అందించేందుకు సిద్ధమైంది.
సాధారణంగా పలు కంపెనీలు 48 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్‌ను అందిస్తాయి. కానీ ఓలా అత్యధికంగా 60 నెలల వరకు ఆఫర్ చేస్తుంది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99 శాతం వడ్డీ రేటుతో ఓలా స్కూటీని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. దీంతో మిగతా ఎలక్ట్రిక్ కంపెనీలకు ఓలా గట్టి పోటీ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఈ రుణ సదుపాయాన్ని పొందొచ్చని కంపెనీ తెలిపింది.
తమ భాగస్వాములతో కలిసి అందిస్తున్న ఫైనాన్సింగ్ సదుపాయాల ద్వారా మార్కెట్‌లో ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించామని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ చెప్పారు. టైర్-1 మాత్రమే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో సైతం ఈవీలు సొంతం చేసుకునేందుకు తమ ఫైనాన్సింగ్ మార్గాలు ఉపయోగపడతాయన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న 700పైగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఆగస్టు నాటికి వెయ్యికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Ola Electric offers two wheelers with zero down payment
Ola Electric,electric scooters,ola ev,zero down payment,ev scooty,ather ev,