OnePlus 12 series: వన్ ప్లస్ నుంచి కొత్త మోడల్.. ధర ఫీచర్లు ఇవే
X
వన్‌ప్లస్ 11 సిరీస్ కు సక్సెసర్ గా కంపెనీ మరో రెండు ఫోన్లను తీసుకొస్తుంది. OnePlus 12, OnePlus 12Rగా విడుదలైన ఈ ఫోన్లు.. పాత సిరీస్ తో పోల్చితే కెమెరా, ప్రాసెసర్ బెటర్ అప్ డేట్ తో వస్తున్నాయి. అమెజాన్, వన్ ప్లస్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు జనవరి 30వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. OnePlus 12 మోడల్ 12GB RAM+256GB, 16GB RAM+512GB వేరియంట్లలో వస్తుండగా.. OnePlus 12R 8GB RAM+128GB, 16GB RAM+256GB వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. OnePlus 12.. ఫ్లోవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్ కలర్స్ లో వస్తుండగా, OnePlus 12R.. కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్స్‌లో విడుదలవుతుంది.
OnePlus 12 specifications:
* 6.82 అంగుళాల డిస్ ప్లేతో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
* ఇండియన్ మార్కెట్ లో Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తున్న రెండో ఫోన్ ఇది.
* ఇందులో 50MP+48MP+64MP మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ప్లస్ పాయింట్.
* 5,400mAh బ్యాటరీ,100W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది.
* ఫోన్ 50W వైర్‌లెస్,10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
* దీని ధర 12GB RAM+256GB రూ.64,999, 16GB RAM+512GB రూ.69,999గా ఉంది.
OnePlus 12R specifications:
* 6.78 అంగుళాల డిస్ ప్లే.. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది.
* స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది.
* 50MP+8MP+2MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్.
* 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో సపోర్ట్ తో వస్తుంది.
* దీని ధర 8GB RAM+128GB రూ.39,999, 16GB RAM+256GB రూ.45,999గా ఉంది.