Home > టెక్నాలజీ > OnePlus: మార్కెట్‌లోకి వన్​ప్లస్​ నార్డ్ సిరీస్​ ఫోన్స్​ లాంఛ్​.. ఎప్పుడంటే..

OnePlus: మార్కెట్‌లోకి వన్​ప్లస్​ నార్డ్ సిరీస్​ ఫోన్స్​ లాంఛ్​.. ఎప్పుడంటే..

OnePlus: మార్కెట్‌లోకి వన్​ప్లస్​ నార్డ్ సిరీస్​ ఫోన్స్​ లాంఛ్​.. ఎప్పుడంటే..
X

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ.. OnePlus మరో మూడు రోజుల్లో.. తన కొత్త మిడ్‌రేంజ్ కెమెరా ఫోన్ ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్ ఈ నెల 5 న మార్కెట్లోకి రానుంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. 6.78 అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ అమోల్డ్ డిస్ ప్లే 120 హెచ్​జెడ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది.బ్యాటరీ సామర్త్యం 5000 ఎంఏహెచ్. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 32,000 లోపు ఉండే అవకాశాలున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్ టెంపెస్ట్​ గ్రే, మిస్టీ గ్రీన్​ అనే​ రెండు కలర్​ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లాట్​ డిస్​ప్లేతో సహా వన్​ప్లస్​ అలర్ట్​ స్లైడర్​ దీనిలో ఉంటుంది. 8జీబీ, 16జీబీ వేరియంట్​లను అనుసరించి ఈ​ స్మార్ట్​ఫోన్ల ధరలు మారుతూ ఉంటాయి.





వన్​ప్లస్​ నార్డ్​ 3తో పాటు నార్డ్​ సీఈ 3 ఫోన్లు సహా, నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ఇయర్​ బడ్స్​ను కూడా విడుదల చేయనుంది వన్ ప్లస్. వాటి స్పెసిఫికేషన్స్​, స్పెషల్​ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.. వన్​ప్లస్​ నార్డ్ 3లోనూ, వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3లోనూ డిస్​ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్లు బహుశా ఒకేలా ఉన్నా.. వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 స్మార్ట్​ఫోన్​లో మాత్రం 12జీబీ ర్యామ్​ సహా, క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 728జీ ప్రాసెసర్​ ఉండవచ్చని టెక్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే ఇది ఆక్వా సర్జ్​ కలర్​ ఆప్షన్​లో కూడా రావచ్చు.





6.74 అంగుళాల 1.5కె రిజొల్యూషన్ అమోలెడ్​ డిస్​ప్లే విత్ 120 హెచ్​జెడ్ రిఫ్రెష్​ రేట్​ తొ వస్తుంది. బ్యాటరీ సామర్త్యం 5000 ఎంఏహెచ్. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది​, ​ర్యామ్​ సపోర్ట్ 12 జీబీ, స్టోరేజ్.. 128జీబీ, ఓఎస్​ : ఆక్సిజన్​ ఓఎస్​13.1. ప్రైమరీ కెమెరా 50ఎమ్​పీ గా ఉంది. వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3 స్మార్ట్​ఫోన్ ప్రారంభ​ ధర బహుశా రూ.24,999 ఉండవచ్చని మార్కెట్​ వర్గాల అంచనా. వన్​ప్లస్​ రెండు నార్డ్​ సిరీస్​ స్మార్ట్​ఫోన్లతో పాటు, వైర్​లెస్​ నార్డ్​ బడ్స్​ను కూడా లాంఛ్​ చేస్తోంది. దీని ధర బహుశా రూ.2,500 వరకు ఉండవచ్చు.








Updated : 2 July 2023 5:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top