Oneplus : రూ.20 వేలలోపే 5G స్మార్ట్‌ఫోన్
X
స్మార్ట్‌ఫోన్లలో వన్ ప్లస్ మోడల్స్ బాగా పాపులర్ అయ్యాయి. అందులో Nord Ce3 Lite కూడా ఒకటి. అద్భుతమైన కెమెరాతో పాటుగా బ్యాటరీ బ్యాకప్ వంటి మంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్సేంజ్ ఆఫర్లో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. రూ.20 వేలలోపు బడ్జెట్‌లో 5జీ ఫోన్ కొనాలనుకునేవారికి అమెజాన్ మరోసారి బంపరాఫర్ తీసుకొచ్చింది. Nord Ce3 Lite ఫోన్‌ను గతంలో కంటే తక్కువ ధరలో అమెజాన్ అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం ఈ మొబైల్‌పై రూ.2 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో Nord Ce3 Lite ఫోన్ ధర రూ.17,999కి చేరింది. ఇకపోతే బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,350 వరకూ తగ్గుతుంది. అలాగే పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.16,950కే 5జీ స్మార్ట్ ఫోన్ సొంతం అవుతుంది. ప్రస్తుతం రెండు కలర్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.
8GB+256GB వేరియెంట్‌ను కొనుగోలు చేస్తే రూ.20 వేలలోపు ఫోన్ అందించనుంది. 8GB+128GB మోడల్ ధర రూ.17,999కు, 8GB+256GB మోడల్ ధర రూ.19,999కు లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. OnePlus Nord3 5G స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరాతో కలిపి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్, 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.