Home > టెక్నాలజీ > 10 నిమిషాల్లో 13 వేల కోట్లు నష్టపోయిన రిలయన్స్

10 నిమిషాల్లో 13 వేల కోట్లు నష్టపోయిన రిలయన్స్

10 నిమిషాల్లో 13 వేల కోట్లు నష్టపోయిన రిలయన్స్
X

రిలయన్స్ ఇండస్ట్రీ పాపం బేజారెత్తిపోతోంది. రెండు రోజులుగా వీటి స్టాక్స్ పడిపోతునే ఉన్నాయి. ఈరోజు కేవలం పదంటే పదే నిమిషాల్లో ఏకంగా 13వల కోట్లకు పైగా నష్టపోయింది.

నిన్న మధ్యాహ్నం మొదలైప షేర్ల పతనం ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం కూడా రిలయన్స్ కంపెనీ స్టాక్స్ దిగువ స్థాయికి వెళ్ళిపోయాయి. నిన్న స్టాక్స్ ఒకశాతం కంటే ఎక్కవు డౌన్ అయ్యాయి. ఈరోజు అది మరింత దిగజారి 0.75కు పడిపోయింది. ఉదయం పదిగంటలకు కంపెనీ షేర్ బిఎస్ఈలో 2433.90 రూ. ల దగ్గర ఉంటే పది నిమిషాల తర్వాత 2424 దగ్గరకు పడిపోయింది. నిన్న ఇవే షేర్లు 2442.55 దగ్గర కనిష్టానికి ముగిసాయి.

పదినిమిషాల్లో షేర్లు పతనం అవ్వడం వలన 13 వేల కోట్లు లాస్ అయ్యింది రిలయన్స్. నిన్న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ ఎమ్ క్యాప్ 16,52,535.99 కోట్లు ఉంటే ఈరోజు షేర్ 2424 దగ్గరకు రాగానే ఆ మార్కెట్ క్యాప్ 16,39, 346.24కు దిగజారింది. అంటే 13, 189.75 కోట్ల నష్టం వాటిల్లింది అన్నమాట. రిలయనస్ డౌన్ ట్రెండ్ లాస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉంది. కిందటి వారం కూడా కంపెనీ షేర్స్ నష్టాన్ని చవిచూశాయి. దీనివలన 3.39 శాతం నష్టం వాటిల్లిందని స్వయంగా కంపెనీనే అనౌన్స్ చేసింది. దాని తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి 58,600 కోట్లకు పైగా క్లియర్ అయిపోయింది. ఇక ఈ వారం ...ఈ రెండు రోజుల్లో పరిశీలిస్తే 1.86 శాతం కంపెనీ నష్టపోయింది. రెండు వారాలు కలుపుకుని కంపెనీ ఇప్పటివరకు మార్కెట్ క్యాప్ నుంచి 90వేల కోట్లకు పైగా నష్టపోయాయని గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 29 Aug 2023 1:48 PM IST
Tags:    
Next Story
Share it
Top