Oppo A59 5G: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్.. సూపర్ ఆఫర్.. రూ.1500 డిస్కౌంట్!
X
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) తన ‘ఏ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ59 5జీ (Oppo A59 5G) పేరుతో కొత్త మొబైల్‌ని భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. శుక్రవారం లాంచ్ అయిన ఈ కొత్త ఫోన్ డిసెంబర్ 25 నుంచి అందుబాటులోకి రానుంది. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.
5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్ ధరను మాత్రం రూ.16,999 అని తెలుస్తోంది. సిల్క్ గోల్డ్, స్టార్రి బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఏయూ ఫైనాన్స్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1,500 డిస్కౌంట్ అందించనుంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఫీచర్ల విషయానికొస్తే..
బ్యాటరీ కెపాసిటి (mAh) 5,000
ఫాస్ట్ ఛార్జింగ్ సూపర్ VOOC
కలర్స్ సిల్క్ గోల్డ్, స్టార్రీ బ్లాక్
డిస్ ప్లే 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్ 90 Hz
ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6020
RAM 6GB
ఇంటర్నల్ స్టోరేజీ 128GB
రేర్(మొయిన్) కెమెరా 13-megapixel + 2-megapixel
ఫ్రంట్ కెమెరా 8-megapixel
ఆపరేటింగ్ సిస్టమ్ Android 13
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (Android 13)తో పనిచేస్తుంది. 5,000 mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లో 52శాతం ఛార్జ్ అవుతుందని ఒప్పో పేర్కొంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.