Home > టెక్నాలజీ > వరల్డ్కప్ కోసం ఓయో బిజినెస్ స్ట్రాటజీ.. మామూలు తెలివి కాదు..?

వరల్డ్కప్ కోసం ఓయో బిజినెస్ స్ట్రాటజీ.. మామూలు తెలివి కాదు..?

వరల్డ్కప్ కోసం ఓయో బిజినెస్ స్ట్రాటజీ.. మామూలు తెలివి కాదు..?
X

వరల్డ్ కప్ ఫీవర్ మొదలయింది. రానున్న ఈ మెగా టోర్నీ కోసం ఫ్యాన్స్, బిజినెస్ మ్యాన్స్, స్టేడియం స్టాఫ్ ఇలా అన్ని వర్గాలు తమ కసరత్తులు మొదలుపెట్టాయి. దేశంలోని మొత్తం పది నగరాలు ఈ మెగా ఈవెంట్ కు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓయో కూడా తమ పనుల్ని మొదలుపెట్టింది. ఫ్యాన్స్ సౌకర్యార్థం ఊహించని ముందడుగు వేసింది.

ప్రధాన నగరాల్లోని హోటల్స్ అన్నీ వరల్డ్ కప్ టైంలో నిండిపోతాయి. దేశ నలుమూలల నుంచి వచ్చే అభిమానులతో ఫుల్ గిరాకీ ఉంటుంది. కొన్ని చోట్ల డిమాండ్ కు తగ్గ ఫెసిలిటీలు లేక ఇబ్బందులు పడుతుంటారు. దీన్నే ఓయే సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. దేశ వ్యాప్తంగా ఆతిథ్య నగరాల్లోని 500 కొత్త ఓయో హొటల్స్ ను మొదలుపెట్టబోతోంది. ఐపీఎల్ సందర్భంగా హోటల్స్ కు ఎంత డిమాండ్ పెరిగిందో తెలిసిందే. హోటల్స్ ఫుల్ అవడమే కాకుండా.. స్విగ్గీ, జొమాటో బిజినెస్ కూడా భారీగా పెరిగింది.


Updated : 18 July 2023 7:47 PM IST
Tags:    
Next Story
Share it
Top