టికెట్ క్యాన్సిల్ చేసినా.. 100% డబ్బు వాపస్
X
పేటీఎం కీలక ప్రకటన చేసింది. దీపావళి సందర్భంగా పేటీఎం యాప్ ద్వారా రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలను అందిస్తున్నట్లు తెలిపింది. పేటీఎంలో బస్ టిక్కెట్ బుకింగ్ పై రూ.500 వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ట్రైన్ టిక్కెట్ ను బుక్ చేసి, ప్రయాణానికి ఆరు గంటల ముందు వరకూ క్యాన్సిల్ చేసుకున్నా, తక్షణమే వారి ఖాతాలోకి మొత్తం డబ్బు జమ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తత్కాల్ సహా, అన్ని టిక్కెట్లకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఎలాంటి అదనపు రుసుములూ కూడా ఉండవని ప్రకటించింది.
అలాగే ప్రత్యక్ష బస్సు ట్రాకింగ్ సేవలను పేటీఎం అందిస్తుంది. సురక్షితమైన, అవాంతారాలు లేని ప్రయాణం కోసం పేటీఎం లైవ్ బస్ ట్రాకింగ్ సేవను తీసుకొచ్చింది. ఇది వినియోగదారలు సులభంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రయాణించేందుకు తోర్పడుతుంది. అదే సమయంలో బుక్ చేసిన బస్సు స్టేటస్ ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చని తెలిపింది. పేటీఎం 2500 బస్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సేవలందిస్తున్నట్లు తెలిపింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.