Home > టెక్నాలజీ > సిమ్ కార్డు.. ఇంటర్నెట్ లేకుండా.. ఫోన్లోనే టీవీ చూడొచ్చు

సిమ్ కార్డు.. ఇంటర్నెట్ లేకుండా.. ఫోన్లోనే టీవీ చూడొచ్చు

సిమ్ కార్డు.. ఇంటర్నెట్ లేకుండా.. ఫోన్లోనే టీవీ చూడొచ్చు
X

టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. రేడియో నుంచి టీవీకి అప్ గ్రేడ్ అయ్యాం. ఇంటర్నెట్ వచ్చాక మొబైల్ ఫోన్స్ లో ఓటీటీ బాట పట్టాం. లైవ్ స్ట్రీమింగ్ కు రకరకాల యాప్ లను వాడుతున్నాం. అరచేతిలోనే ప్రపంచాన్నంతా చూడగలుగుతున్నాం. అయినా.. టీవీలకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టీవీల్లో వచ్చే ప్రసారాలను చూసేందుకు చాలామంది ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ క్రేజ్ కు తగ్గట్లు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ లేకుండా.. ఫోన్ లోనే టీవీని చూసే సౌకర్యాన్ని కల్పించనుంది. అందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీపై తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీ ప్రయోగ పరీక్షలను ప్రస్తుతం దేశంలోని 19 ప్రముఖ పట్టణాల్లో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

ఐఐటీ కాన్పూర్, సాంఖ్య ల్యాబ్స్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ సాయంతో.. ఎఫ్ఎం రేడియోలా ఫోన్ లో వీడియోలు చూడొచ్చు. అయితే ఈ టెక్నాలజీను ఉపయోగించుకుని విద్యా, అత్యవసర హెచ్చరికల వంటివాటిని.. ఈ టెక్నాలజీ సాయాన్ని వాడుకుని ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంరది. రేడియో, టీవీ టెక్నాలజీలో ఓ డివైజ్ ఉంటుంది. ఆ డివైజ్ లోని రిసీవర్ వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలను తీసుకుని.. కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. డీ2ఎం టెక్నాలజీలో కూడా ఇంచుమించు ఇదే టెక్నాలజీ ఉంటుంది. అయితే టీవీలో సెటప్ బాక్స్ లకు రిసీవర్స్ ఉన్నట్లు.. ఫోన్లలో ఉన్న రిసీవర్స్ సాయంతో కార్యక్రమాలను ఫోన్ లో చూడొచ్చు.

ఈ టెక్నాలజీలో బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌లు రెండూ కలిసి ఉంటాయి. ఈ టెక్నాలజీని టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్ లో ప్రసారం చేస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 470-582 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ ను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. దీనికి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి, టెలికం ఆపరేటర్లకు మేలు చేస్తుంది. దీనిద్వారా 25 నుంచి 30 శాతం వరకు వీడియో కంటెంట్ తగ్గుతుందని చెప్తున్నారు. ఫలితంగా 5జీ నెట్వర్క్ పై భారం తగ్గుతుంది.

Updated : 1 Feb 2024 9:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top