Home > టెక్నాలజీ > Lava Yuva 3 : రూ.7 వేలలోపే అదిరిపోయే ఫోన్.. 'లావా' కొత్త మొబైల్ లాంచ్

Lava Yuva 3 : రూ.7 వేలలోపే అదిరిపోయే ఫోన్.. 'లావా' కొత్త మొబైల్ లాంచ్

Lava Yuva 3 : రూ.7 వేలలోపే అదిరిపోయే ఫోన్.. లావా కొత్త మొబైల్ లాంచ్
X

(Lava Yuva3) ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లావా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే లావా యువ2, లావా యువ3 ప్రో పేర్లతో తీసుకొచ్చిన ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ మోడల్ మొబైల్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో లావా యువ 3 మొబైల్‌ను లావా కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. అలాగే 18wతో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

లావా కంపెనీ లాంచ్ చేసిన కొత్త మొబైల్ రెండు వేరియంట్లలో లభించనుంది. అందులో 4 జీబీ + 64 జీబీ వేరియంట్ మొబైల్ ధరను రూ.6,799గా నిర్ణయించింది. రూ.7 వేలలోపే లభించే ఈ ఫోన్ యువతను ఎక్కువగా ఆకర్షించనుంది. అదేవిధంగా 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభించే ఫోన్ ధరను రూ.7,299గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు వేరియంట్ల ఫోన్లు మూడు రంగుల్లో లభించనున్నాయి. ఎక్లిప్స్ బ్లాక్, కాస్మిక్ లావెండర్, గెలాక్సీ వైట్ రంగులల్లో ఈ మొబైల్స్ ఉన్నాయి.





ఫిబ్రవరి 7వ తేది నుంచి అమెజాన్‌లో లావా యువ 3 మొబైల్స్ విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తేది నుంచి లావా ఇ-స్టోర్‌తో పాటుగా ఇతర రిటైల్ దుకాణాల్లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. లావా యువ 3 ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. అది 90Hz రిఫ్రెష్ రేటుతో పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 13తో ఈ ఫోన్ వస్తుండగా దానిని ఆండ్రాయిడ్ 14కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ట్రిపుల్ కెమెరాతో ఏఐ, వీజీఏ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 ఎంపీ కెమెరాను అమర్చారు.






Updated : 3 Feb 2024 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top