WhatsApp Polls : వాట్సాప్ కొత్త అప్డేట్.. అందుబాటులో కొందరికే
X
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంటుంది. గతేడాది చానల్స్ ఫీచర్ ను పరిచయం చేసింది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ ను విస్తరించే పనిలో పడింది వాట్సాప్. అందులో భాగంగానే చానెల్స్ లో ఇప్పుడు కొత్త ఫీచర్.. పోల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటివరకు గ్రూప్స్, చాట్స్ లో మాత్రమే కనిపించిన వాట్సాప్ పోల్స్.. ఇకపై చానెల్స్ లోనూ కనిపించనున్నాయి. ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో పంచుకుంది.
ఈ ఫీచర్ ఎలా వినియోగించుకోవాలంటే... టెక్ట్స్ బాక్స్ లో కనిపించే అటాచ్మెంట్ సింబల్ పై క్లిక్ చేయగానే పోల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వాట్సాప్ పోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే చానెల్స్ నిర్వహించే వ్యక్తికి మాత్రమే ఈ పోల్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. పోల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ‘Allow single poll’ ఆప్షన్ కూడా ఎంపిక చేసుకోవచ్చు.