బ్లూ మూన్.. పండుగ వేళ ఆకాశంలో అద్భుతం
X
రాఖీపూర్ణిమ నాడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. ఈ రోజు రాత్రి వేళ చంద్రుడు నీలం రంగులో పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీనినే బ్లూ మూన్ అంటారు. . ఈ ఆగస్టు నెలలో రెండు పున్నములు ఏర్పడబోతోన్నాయి. ఇందులో ఒకటి ఈ నెల 1వ తేదీన సంభవించింది. దాన్ని సూపర్ మూన్‌గా పిలిచారు. మరొకటి ఆగస్ట్ 30న అంటే ఈ రోజే చోటు చేసుకోబోతోంది. ఇది సూపర్ బ్లూ మూన్.భూమికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల సాధారణ సైజ్ కన్నా మరింత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. ఈ రోజు సాయంత్రం 7.10 గంటల తరువాత ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ ఆగమనం ప్రారంభమవుతుంది. 31 తెల్లవారుజామున 3. 36 గంటలకు సూర్యుడికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఈ సూపర్ బ్లూ మూన్ ఉంటుంది.
సాధారణ పౌర్ణమి రోజుల కంటే కూడా సూపర్ మూన్ సమయంలో చందమామ మరింత ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు. పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు. బుధవారం రాత్రి ఉదయించే చంద్రుడు కూడా మరింత వెన్నెల పంచబోతోన్నాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెల వెలుగు అధికంగా కనిపిస్తుంది. సగటున ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంటుంది. ఒకే నెలలో రెండు పున్నములు సంభవిస్తుంటాయని నాసా తెలిపింది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే. ఈ బ్లూ మూన్ గత సంవత్సరం 2021 ఆగస్టు నెలలో కనిపించింది. ఆ తర్వాత ఈ ఏడాది (ఆగస్టు 30) ఈ బ్లూ మూన్ కనిపించనుంది. బుధవారం పౌర్ణమి రోజున ఈ బ్లూ మూన్ ప్రకాశవంతంగా ఉంటుంది. బుధవారం రాత్రి 8 గంటలకు IST సూపర్ బ్లూ మూన్ యొక్క ఉత్తమ రూపాన్ని ప్రపంచం చూస్తుంది. తదుపరి సూపర్ బ్లూ మూన్ జనవరి మరియు మార్చి 2037లో కనిపిస్తుంది.