గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్
X
దేశంలో ఇప్పుడు ఎక్కడా చూసిన డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. తోపుడు బండి నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్‌ను పొందుతున్నారు. ప్రతి ఒక్కరు దగ్గర స్మార్ట్ పోన్ సర్వసాధారణం అయిపోవడంతో ఆన్ లైన్ పేమెంట్స్ సులభతరం అయ్యాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసేస్తున్నారు. మన దేశంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల విలువ కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఉమ్మడి లావాదేవీల విలువ కంటే చాలా ఎక్కువ అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు
కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ పెంపుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. డిజిటల్ చెల్లింపు విషయంలో కొత్త అవకాశాలను అందిస్తోంది. ఇటీవల ఆర్భీఐ యూపీఐ లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పిన్ లేకుండా రియల్ టైమ్‌లో తక్కువ మొత్తంలోనే పేమెంట్స్ చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే దీని లిమిట్‌ను ఆర్బీఐ పెంచుతూ కీలక ప్రకటన చేసింది.
ఇప్పటి వరకు యూపీఐ లైట్ ద్వారా గరిష్ఠంగా రూ.200 వరకు మాత్రమే పేమెంట్స్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు ఈ లిమిట్ రూ. 500కు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీంతో ఇకపై ఎలాంటి పిన్ లేకుండా ఈజీగా రూ. 500 వరకు పేమెంట్స్ చేయొచ్చు. ఈ నిర్ణయంతో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, బీమ్ యూపీఐ వంటి యాప్స్ వాడే వారికి ప్రయోజనం కలగనుంది.