Redmi Note 13 : అదరగొట్టే లుక్స్, ఫీచర్స్తో.. రెడ్మీ ఈసారి గట్టిగా ఇస్తుంది
X
ఇండియన్ మార్కెట్ లో ఎన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఉన్నా.. రెడ్మీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బడ్జెట్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో ఫోన్స్ ను తీసుకొస్తారని చాలామంది ఈ బ్రాండ్ ను కొనడానికి మొగ్గుచూపిస్తారు. అందుకే రెడ్ మీ ఫోన్లలో నోట్ సిరీస్ అంత హిట్ అయింది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఆ ఫోన్లను బీట్ చేసే మరొక ఫోన్ రాలేదు. అందుకే మరో ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా రెడ్మీ నోట్ 12 సిరీస్ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. దీనికి సక్సెసర్ గా రెడ్మీ నోట్ 13 సిరీస్ ను తీసుకోస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
వేరియంట్స్: రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో+
బ్యాటరీ: నోట్ ప్లస్ 4,880 ఎంఏహెచ్, నోట్ ప్రో+ 5020 ఎంఏహెచ్
డిస్ ప్లే: 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే
స్టోరేజ్: నోట్ ప్రో 16జీబీ+ 512 జీబీ, నోట్ ప్రో+.. 18జీబీ+ 1టీబీ (హై ఎండ్ వేరియంట్స్)
కెమెరా: బ్యాక్ 200 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో షాట్స్... ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ
సిస్టమ్: ఆండ్రాయిడ్ 13
ధర: (ఈ ఫోన్ ధర ఇంకా ప్రకటించలేదు)