Home > టెక్నాలజీ > జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది.. వైర్ల చిక్కులకు చెక్.. ప్లాన్లు ఇలా

జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది.. వైర్ల చిక్కులకు చెక్.. ప్లాన్లు ఇలా

జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది.. వైర్ల చిక్కులకు చెక్.. ప్లాన్లు ఇలా
X

రిలయన్స్‌ కంపెనీ భారతీయ డిజిటల్ రంగంలో మరో ముందుడుగు వేసింది. జియో ఎయిర్‌ఫైబర్‌ (Reliance Jio AirFiber) మంగళవారం మర్కెట్లోకి విడుదల సింది. వైర్‌లెస్ విధానంలో పనిచేసే ఈ 5జీ వైఫై సర్వీస్ గృహావసరాలతోపాటు వ్యాపార అవసరాలకు కూడా ఇంటర్నెట్‌, ఇతర డిజిటల్ సేవలను అందిస్తుంది. వైర్లతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్ల స్థానంలో తీసుకొచ్చిన ఎయిర్ ఫైబర్... ఇప్పటికే జియో అందిస్తున్న జియో ఫైబర్‌కు పూర్తి భిన్నం. జియో ఫైబర్‌.. ఆప్టికల్‌ కేబుల్స్‌ ఆధారితం కాగా ఎయిర్‌ఫైబర్‌ దాని పేరులోనే ఉన్నట్లు వైర్లు లేకుండా 5జీ సేవలు అందిస్తుంది. 5జీ రేడియో లింక్‌ ద్వారా సమీపంలోని టవర్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకొని ఇంటర్నెట్‌ను అధికవేగంతో అందిస్తుంది. దీన్ని అన్న రకాల డివైజులకు లింక్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్టీవీ, వంటి అన్ని డివైజ్‎ల‎కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‏లకు ఒకేసారి వై-ఫై కనెక్ట్ చేసినా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గదని కంపెనీ చెబుతోంది.

జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల్లో ఈ ఎయిర్‌ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఎయిర్ ఫైబర్‌కు సెక్యూరిటీ ఫైర్‌వాల్‌ ఉంటుంది.

ప్లాన్లు..

జియో ఎయిర్‌ఫైబర్‌లో ప్రస్తుతం రూ. 599 నుంచి రూ. 3999 వరకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

నెలవారీ ప్లాన్లలో.. రూ.599 ప్లాన్లో 30Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు వస్తాయి.

రూ.899 ప్లాన్‌లో 100Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ వంటివి వస్తాయి. రూ.1199లో 100Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా వంటి ఓటీటీల సేవలు అందుతాయి.

6 లేదా 12 నెలెల చందాతో లభించే జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్లకు ఇన్ స్టేషన్ చార్జీలకింద రూ. 1000 చెల్లించాలి. 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఈ చార్జీ నుంచి మినహాయింపు ఇస్తారు.

రూ.1499 ప్లాన్ కింద 300Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు వస్తాయి.

రూ.2499 ప్లాన్‌లో 500Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.

రూ.3999 ప్లాన్‌లో 1Gbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు అందుతాయి.

Updated : 19 Sept 2023 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top