Home > టెక్నాలజీ > అతితక్కువ ధరకే జియో 4జీ ఫోన్‌.. రిఛార్జ్ ప్లాన్ కూడా..

అతితక్కువ ధరకే జియో 4జీ ఫోన్‌.. రిఛార్జ్ ప్లాన్ కూడా..

అతితక్కువ ధరకే జియో 4జీ ఫోన్‌.. రిఛార్జ్ ప్లాన్ కూడా..
X

రిలయెన్స్ జియో దేశ టెలికాం రంగం స్వరూపాన్నే మార్చేసింది. ఫ్రీ కాల్స్తో అడుగుపెడుతూనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపింది. ఇప్పుడు మరో భారీ ఆఫర్తో రికార్డును సృష్టించనుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు 4జీ ఫోన్లను అతి తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. జియో భారత్‌ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. దీని బీటా ట్రయల్ జూలై 7 నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా 10 లక్షల మందిపై ఈ ట్రయల్ను నిర్వహిస్తారు.

అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ. 123 ప్లాన్‌ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది.మొబైల్ లో 4.5 సెం.మీ. TFT స్క్రీన్‌, 1000mAh బ్యాటరీ, 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి. ఇంకా ఇందులో జియో సినిమా, జీయో సావన్, జీయో పే వంటి యాప్స్ ఉంటాయి. ఈ మొబైల్ 22 భారతీయ భాషల్లో పని చేయగలదు.





ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో కంపెనీ తెలిపింది. దేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మొబైల్ ఫోన్ యూజర్స్ 2G యుగంలోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో ముందడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు ‘‘ప్రతీ భారతీయుడికి ఇంటర్నెట్‌, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్‌ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం’’ అని చెప్పారు.

Updated : 3 July 2023 8:02 PM IST
Tags:    
Next Story
Share it
Top