అతితక్కువ ధరకే జియో ల్యాప్టాప్.. ధర ఎంతంటే..?
X
రిలయెన్స్ జియో దేశ టెలికాం రంగం స్వరూపాన్నే మార్చేసింది. ఫ్రీ కాల్స్తో అడుగుపెడుతూనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపింది. ఇప్పుడు అతితక్కువ ధరకే ల్యాప్టాప్ను తీసుకొచ్చి.. మరోసారి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఈ ల్యాప్టాప్ సోమవారం భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. గతేడాది తీసుకొచ్చిన జియో బుక్కు కొనసాగింపుగా జియో బుక్ 2023ని విడుదల చేసింది.
జియో బుక్ ఫీచర్లు..
జీయో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్ టాప్ పనిచేయనుంది. ప్లాస్టిక్ బాడి, 11.6 ఇంచెస్ హెచ్డీ డిస్ ప్లేతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. వీడియో కాలింగ్ కోసం 2ఎంపీ హెచ్డీ కెమెరాతో పాటు 4జీబీ ర్యామ్, 64 జీబీ ఫ్లాష్ మెమోరీని కలిగివుంది. కేవలం 990 గ్రాముల బరువుతో ఈ ల్యాప్టాప్ లాంచ్ అయ్యింది. దీన్ని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా.. 8గంటల బ్యాటరీ లైఫ్ను అందించనుంది.
అతితక్కువ ధరతో..
జియో బుక్ బ్లూ కలర్ ఆప్షన్లో లాంచ్ అవ్వగా.. ఇన్బిల్ట్ సిమ్ కార్డ్తో అందుబాటులోకి రానుంది. అగస్ట్ 5 నుంచి జియో బుక్ సేల్ ప్రారంభమవుతుంది. దీన్ని ధరను 16,499గా నిర్ణయించారు. రిలయన్స్ డిజిటల్, అమెజాన్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇక గతేడాది రిలీజైన జియో బుక్ ధర 15,799గా ఉంది.
Welcome your ultimate learning book - JioBook. An all-in-one solution for learning anything, anytime, anywhere. 😎
— Reliance Jio (@reliancejio) July 31, 2023
Pre-order your all new JioBook now https://t.co/5jnRKhPN4B#AllNewJioBook #AllNewJioBookLaptop #Laptop #Jio #Learning #Entertainment pic.twitter.com/Yo16aXMLGv