Home > టెక్నాలజీ > Renault Kwid : హై ఎండ్‌ ఫీచర్లతో రెనాల్ట్‌ కార్లు.. పూర్తి వివరాలివే!

Renault Kwid : హై ఎండ్‌ ఫీచర్లతో రెనాల్ట్‌ కార్లు.. పూర్తి వివరాలివే!

Renault Kwid : హై ఎండ్‌ ఫీచర్లతో రెనాల్ట్‌ కార్లు.. పూర్తి వివరాలివే!
X

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ 2027 నాటికి భారత మార్కెట్లోకి 5 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌లో ట్రైబర్, కిగర్ కార్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఎలాంటి ఫీచర్స్ అదిస్తారనేది మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఇవి కాకుండా, కంపెనీ B+, C సెగ్మెంట్ SUV మోడల్స్‌ను కూడా తీసుకురానుంది. అంతేకాకుండా బిగ్‌ స్టార్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ వెర్షన్ కూడా లాంచ్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ కారు విడుదల కానుంది.

ఇక రెనాల్ట్ క్విడ్‌ ఎలక్ట్రిక్ మోడల్‌లో కూడా మరిన్ని అప్‌డేట్స్ చేయనున్నారు. ఈ ప్లాన్‌లలో 5th మోడల్ ఎలక్ట్రిక్(Kwid EV) కారును అప్‌డెట్స్‌తో తీసుకురానున్నారు. ఇది ప్రస్తుత రెనాల్ట్ క్విడ్ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది, దీని బంపర్, లైట్లు, గ్రిల్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV)కి తగ్గట్టుగా మార్చనున్నారు. ప్రస్తుతం యూరప్‌లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ క్విడ్ 26.8kWh బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఇది 295 కిమీ మైలెజ్ ఇస్తుంది. అయితే, భారతీయ స్పెక్‌లో ఈ బ్యాటరీ ప్యాక్ భిన్నంగా ఉండవచ్చు. దీని ధర రూ.10 లక్షల లోపే ఉంటుందని అంచనా.

పోర్ట్‌ఫోలియో అప్‌డేట్

రెనాల్ట్ 2024లో తన మోడల్స్ పోర్ట్‌ఫోలియోలో కీలక అప్‌డేట్ చేశారు - క్విడ్, ట్రైబర్, కిగర్. రెనాల్ట్ క్విడ్ వంటి వేరియంట్‌ల ధరలు రూ.22,000 వరకు తగ్గనున్నాయి. అదేవిధంగా, కొత్త అప్‌డేట్‌తో వచ్చే ట్రైబర్ RXE వేరియంట్‌పై రూ. 34,000 వరకు RXL వేరియంట్‌పై రూ. 30,000 తగ్గింపు ఉంది. ఇది కాకుండా, రెనాల్ట్ కిగర్ బేస్ వేరియంట్ రూ.50,000 తగ్గింది, అలాగే ఇతర వేరియంట్‌లపై రూ.5,000 నుండి రూ.47,000కు తగ్గించారు.

Updated : 9 Jan 2024 7:52 PM IST
Tags:    
Next Story
Share it
Top