Home > టెక్నాలజీ > మార్కెట్లో శాంసంగ్ సరికొత్త 5G మోడల్ ఫోన్

మార్కెట్లో శాంసంగ్ సరికొత్త 5G మోడల్ ఫోన్

మార్కెట్లో శాంసంగ్ సరికొత్త 5G మోడల్ ఫోన్
X

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి సరికొత్త 5g మోడల్ ఫోన్‎ను ఆవిష్కరించింది. ఆగస్టు 7న Galaxy F34 5G ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గెలాక్సీ A34 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుంది. రెండు ఫోన్లు డిజైన్ ఒకేలా ఉన్నప్పటికీ స్పెసిఫికేషన్స్ లో మాత్రం మార్పులు చేశారు. Galaxy F34 5G ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ అనే రెండు రంగులలో ప్రస్తుతం అందుబాటులో ఉంది.





శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ :

*6.46-అంగుళాల ఫుల్-HD+ (2340 x 1080 పిక్సెల్‌లు) sAMOLED డిస్‌ప్లే

*120Hz రిఫ్రెష్ రేట్

*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌

*8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఇంటర్నల్ ఆక్టా-కోర్ Exynos 1280 SoC ద్వారా అందిస్తుంది.

*Android 13-ఆధారిత One UI 5.1తో షిప్పించ్ చేసే అవకాశం

*50mp కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్, వెనుకవైపు 2MP మాక్రో సెన్సార్

*13MP ఫ్రంట్ కెమెరా సెన్సార్

*6,000mAh బ్యాటరీ

*సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

*5G, GPS, NFC, Wi-Fi, బ్లూటూత్ v5.3, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు

Galaxy F34 5G ఫోన్ ధర

శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ 6GB + 128GB వేరియంట్ భారత మార్కెట్లో రూ. 18,999 కాగా, 8GB + 128GB ఆప్షన్ ధర రూ. 20,999 ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ తొలి డెలివరీ తేదీని ఆగస్టు 12గా లిస్టు చేసింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు నో-కాస్ట్ EMI ప్లాన్‌ రూ.2,111తో కొనుగోలు చేయొచ్చు. పలు బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సదుపాయం కలదు.





Updated : 7 Aug 2023 3:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top