12 వేలకే ఫ్లాగ్షిప్ ఫీచర్స్.. శాంసంగ్ అదరగొట్టిందిగా!
X
ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చాలామంది శాంసంగ్ ఫోన్ ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మార్కెట్ లో వన్ ప్లస్సే టాప్. అయితే శాంసంగ్ మాత్రం తన మార్కెట్ ను ఇప్పటికీ అలానే ఉంచుకుంది. ఫ్యామిలీ వినియోగదారులను సొంతం చేసుకుంది. ఆ మార్కెట్ ను క్యాచ్ చేసిన శాంసంగ్ తాజాగా బడ్జెట్ లో ఓ ఫోన్ ను తీసుకొస్తుంది. రూ.12 వేలకే టాప్ ఫీచర్స్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఫోన్ ఈ కామర్స్ జెయింట్ ఫ్లిస్ కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో మార్చి 5 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.
Samsung Galaxy F15 5G specifications:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5 వర్షన్‌పై పని చేస్తుంది. ఐదేండ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, నాలుగేండ్లు ఓఎస్ అప్ డేట్స్ వస్తాయి.
6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో రానుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ కలిగి ఉంటుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ తో.. 50 మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరా, 13-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్.
6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.. సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లతో వస్తుంది. 4 జీబీ వేరియంట్ ధర రూ. 12,999 ఉండగా.. 6 జీబీ వేరియంట్ ధర రూ.14,499గా కంపెనీ నిర్ణయించింది.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.