Viral News : ఈ టీవీని ఆస్తులు అమ్ముకున్నా కొనలేరు..
X
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ అత్యంత భారీ, భూమి మీద దొరికే అత్యంత కఠినమైన పదార్థంతో తయారుచేసిన ఎల్‌ఈడీ టీవీని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 110-అంగుళాల భారీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టీవీ ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టీవీ కొనుగోలు చేయాలంటే అక్షరాలా రూ. 1,14,99,000 వరకు ఖర్చు చేయాల్సిందే.
అల్ట్రా-ప్రీమియం వ్యూను ఇష్టపడే కస్టమర్ల కోసం ఈ మైక్రో ఎల్‌ఈడీ టీవీని రూపొందించనట్లు సంస్థ తెలిపింది. భూమి మీద లభించే రెండో అత్యంత కఠినమైన పదార్థమైన నీలమణితో ఈ మైక్రో ఎల్‌ఈడీ టీవీ తయారు చేసినట్లు శామ్‌సంగ్ ప్రకటించింది. ఈ భారీ టీవీ ఇవాళ్టి నుంచే భారత్‌లోని రిటైల్ స్టోర్‌లలో, శాంసంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ టీవీ ఫీచర్స్ చూస్తే మాత్రం అరుపులే. 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్‌ఈడీ అంటే పెద్ద సైజు ఎల్‌ఈడీలలో 1/10వ వంతు అన్నమాట. ఆకర్షించే డెప్త్, వైవిధ్యమైన కలర్స్, ఎక్సలెంట్ క్వాలిటీ , కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి.
మైక్రో ఎల్‌ఈడీతో పాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్‌డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఇలా మైక్రో ఎల్‌ఈడీ టెక్నాలజీలోని అన్ని ఈ టీవీలో ఉన్నాయి.
స్పెషల్ సౌండ్ సిస్టమ్ ఈ టీవీకి ఉంటుంది. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్ సిస్టమ్‌ను ఈ టీవీకి ఏర్పాటు చేశారు. ఈ టీవీ నుంచి వచ్చే త్రీడీ సౌండ్స్ సినిమా హీల్ ఫీల్‌ను కలిగిస్తాయి. అంతే కాదు పాత వీడియోలను కూడా ఈ టీవీ ఎంతో క్లారిటీగా చూపిస్తుంది.