తక్కువ ధరకే సామ్ సంగ్ కొత్త 5జీ ఫోన్..
X
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్ సంగ్ నుంచి మరో కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లాంచ్ చేసిన ఈ ఫోన్లను.. ఈ నెల 15 నుంచి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గ్యాలక్సీ ఎమ్ 34 ఫీచర్లు..
6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే
HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
6,000mAh బ్యాటరీ
5nm Exynos 1280 SoC ప్రాసెసర్
50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
ధర
సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 5g ఫోన్ బేస్ మోడల్‌కు రూ. 16,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది 6GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తోంది. 8GB +128GB స్టోరేజ్‌తో వచ్చే ఫోన్ ధర 18,999 గా ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ కలదు.
ఇవి తెలుసుకోండి..
సామ్ సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 5g ఫోన్ డిజైన్ Galaxy F54, Galaxy S23లను పోలి ఉంటుంది. 6,000mAh బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ పెద్దగా ఉన్నప్పటికీ పట్టుకోవడానికి ఇబ్బంది అనిపించదు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌లో అమర్చారు.హెడ్‌ఫోన్ జాక్ కూడా ఈ ఫోక్ నుంచి పొందే మరో సౌకర్యం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉంటుంది.