5జి టెక్నాలజీతో మరో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తున్న శాంసంగ్
X
అండ్రాయిడ్ ఫోన్లలో అగ్రగామి శాంసంగ్ మరోరెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. 5జి టెక్నాలజీతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 అనే రెండు ఫోల్డబుల్ మొబైల్స్ ను రిలీజ్ చేస్తోంది.
జులై 26న ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. వీటి ప్రీ బుకింగ్ నీటి నుంచి మొదలవుతుంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సహా శాంసంగ్ అన్ లైన్ స్టోర్లలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రీ బుకింగ్ మొదలువుతుంది. ప్రీ బుకింగ్ ఆఫర్ కింద కేవలం 2వేల రూపాయలతో బుక్ చేసుకునే సదుపాయం కల్సించింది కంపెనీ.
ఇదిలా ఉంటే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ5 ధర 1, 47 వేలు ఉండే అవకాశం ఉంది. బ్లూ, ప్లాటినం, గోధుమరంగు, నలుపు, లైట్ బ్లూ కలర్లలో ఈ ఫోన్ దొరుకుతుంది. గెలాక్సీ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 440ఎమ్హెచ్ భ్యాటరీ, 120 Hzరిఫ్రెఫ్ రేట్, OXGA+AMOLED డిస్ ప్లే ఈ ఫోన్ లో ఉంటాయి. 12 ర్యామ్ ఉంటుంది. దాంతో పాటూ 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజి సదుపాయాలు కూడా కలిగి ఉంది. 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్స్, 12 ఎంపీ టెలీఫోటో లెన్స్ ఇందులో ఉండనున్నాయి.
అలాగే మరో మొబైల్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర 90 వేల రూపాయలు ఉంటుందని చెబుతోంది కంపెనీ. ఇది కూడా స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 4100ఎమ్హెచ్ బ్యాటరీతో అండ్రాయిడ్ 13 ఓఎస్ ను కలిగి ఉంటుందీ ఫోన్. 6.82 అంగుళాల డిస్ ప్లే ఉండే ఈ మొబైల్ లో 12జీబీ ర్యామ్, 256జీబీ, 512 జీబీ, 1టీబీ స్టోరేజి సదుపాయాలు ఉండనున్నాయి. 12 ఎంపీ కెమెరా, స్పెల్ఫీ కోసం కూడా 12 ఎంపీ కెమరా ఉన్నాయిందులో.