Home > టెక్నాలజీ > శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..

శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..

శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..
X

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కస్టమర్లులను ఆకర్షించేలా లేటెస్ట్ అప్‌డేట్స్‌లో కొత్త డివైజెస్ పరిచయం అవుతున్నాయి. ఆ జాబితాలో తాజాగా వస్తోంది ఈ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు శాంసంగ్ త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నూతన మొబైల్‌ను ఈ ఏడాదిలోనే మర్కెట్‌లో తీసురానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ రెవెంగస్ తాజా పోస్ట్ ప్రకారం, కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 లతో పాటు ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లను 2024 లో రిలీజ్ చేయాలని యోచిస్తోంది. ‘‘శాంసంగ్ ఈ ఏడాది తన లైనప్ కు ట్రిపుల్ ఫోల్డ్ ను జోడిస్తుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో హువావే ట్రిపుల్ ఫోల్డ్ ను విడుదల చేయడం దాదాపు ఖాయమైంది’’ రెవెంగస్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ డివైజ్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్ టి టెక్ గతంలోనే వెల్లడించడం సంగతి తెలిసిందే. నూతన ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తో శాంసంగ్ భారీ డిస్ ప్లేను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే హింజ్ పై సెన్సార్లను కూడా అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ ఏడాది చివరి నాటికి ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న హువావే మరో కీలక ప్లేయర్ అని ఆ టిప్ స్టర్ సూచించారు. ఇదిలా ఉంటే శాంసంగ్ ఇటీవల తన రగ్డ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో శామ్సంగ్ ప్రవేశపెట్టిన మొదటి ఎంటర్ప్రైజ్-ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 7 స్టాండర్డ్, ఎంటర్ ప్రైజ్ ఎడిషన్లలో వరుసగా రూ.27,209, రూ.27,530 ధరలతో లభిస్తుంది.




Updated : 14 Feb 2024 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top