Home > టెక్నాలజీ > PLANE :మతిపోగొట్టే భారీ విమానం.. ఆయిల్ అక్కర్లేదు, రన్ వే అక్కర్లేదు..

PLANE :మతిపోగొట్టే భారీ విమానం.. ఆయిల్ అక్కర్లేదు, రన్ వే అక్కర్లేదు..

PLANE :మతిపోగొట్టే భారీ విమానం.. ఆయిల్ అక్కర్లేదు, రన్ వే అక్కర్లేదు..
X

విమానయానంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎలాంటి ఇంధనమూ లేకుండా నింగిలో రయ్యిమని దూసుకెళ్లే ఎయిర్‌షిప్‌ను యరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. సోలార్ పవర్‌తో పనిచేసే ఈ విమానం పొడవు ఏకంగా 495 అడుగులు. ఇప్పటికే కొన్ని సోలార్ విమానాల ప్రయోగాలు చేసినా ఇది వాటితో పోలిస్తే మరింత మెరుగైనది, శక్తిమంతమైనది. గంటకు 83 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ విమానం భూమధ్య రేఖను చుట్టూ 40 వేల కి.మీ ప్రయాణాన్ని ఎక్కడా ఆగకుండా 20 రోజుల్లో పూర్తి చేస్తుంది.

దీని పేరు ఎయిర్‌షిప్ వన్(Airship One). దీనిపై భాగమంతా వేలాది సోలార్ ప్యానళ్లతో నిర్మితమై ఉంటుంది. 51,700 చదరుపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ప్యానళ్లు సూర్యకాంతిని గ్రహించి హైడ్రోజన్‌గా మార్చుకుని రేయింబవళ్లు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్‌తో ప్రయాణిస్తుంది. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉంటారు. భారీ విమానం కావడంతో మామూలు కార్గో విమానానికంటే పదిరెట్ల సరుకును తీసుకెళ్లొచ్చు. 2026లో ఇది ప్రయాణం ప్రారంభించనుంది. 19700 అడుగుల ఎత్తులో వెళ్లీ ఎయిర్‌షిప్‌ వన్‌లో ఫ్రెంచి వ్యోమగామి, ఎయిర్ ఫోర్స్ పైలట్ మైకేల్ టాగ్నినీ, సాహసికుడు బెర్’ట్రాండ్ పికార్డ్ ఇందులో ప్రయాణిస్తారు. దీన్ని గాలిలోనే నిలిపి తిరిగి స్టార్ట్ చేసే అవకాశం ఉండడంతో రన్ వేలతో అవసరం ఉండదు.

Updated : 2 Oct 2023 12:16 PM IST
Tags:    
Next Story
Share it
Top