ఆ ఉద్యోగం కోసం 48 గంటల్లో 3 వేల దరఖాస్తులు..
X
ఆర్థిక మాంద్యం భయంతో కార్పొరేట్ సంస్థలు సతమతమవుతున్నాయి. మెటా, గూగుల్, అమెజాన్, విప్రో వంటి పేరుగాంచిన కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల పరిస్థితి ఇలా ఉంటే..స్టార్టప్ కంపెనీల పరిస్థితి చెప్పక్కర్లేదు. కార్పొరేట్ సంస్థలతోపాటు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు విధిస్తున్నాయి. దీంతో జాబ్ సెక్యూరిటీపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేల సంఖ్యలో టెకీ ఉద్యోగులు క్షణాల్లో నిరుద్యోగులుగా మారిపోయారు. అవకాశాలు కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. తక్కువ ప్యాకేజీకైనా పర్వాలేదు..ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు అనుకుంటున్నారు.
తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో జాబ్ మార్కెట్ గురించి చేసిన ట్వీట్ చూస్తే జాబ్ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్ప్రింగ్‌వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ రిమోట్ వర్క్ ఆప్షన్‌తో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించగా భారీగా దరఖాస్తులు వచ్చాయి.
"మా వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్ట్ ఉద్యోగ ప్రకటన చేసిన 48 గంటల్లో మూడు వేలకు పైగా రెజ్యూమ్‌లు వచ్చాయి. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అని సంస్థ సీఈవో కార్తీక్ మండవిల్లే ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.. స్ప్రింగ్‌వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ రిమోట్ వర్క్ ఆప్షన్‌తో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తన వెబ్‌సైట్‌లో మాత్రమే పోస్ట్ చేసింది.ఇప్పటి వరకు మొత్తం 12వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున్న లేఆఫ్‌లు విధించడం, రిమోట్ వర్క్ అవకాశం ఉండటంతో ఇంతటీ స్పందన వచ్చినట్లు కంపెనీ అభిప్రాయపడింది.-
Received over 3K resumes in the last 48 hours just on our website - how bad is the job market?
— Kartik Mandaville (@kar2905) July 16, 2023