Home > టెక్నాలజీ > Chandrayaan-3 Success: చంద్రయాన్‌-2 జ్ఞాపకాలను చెరిపేసి.. చరిత్ర సృష్టించి..

Chandrayaan-3 Success: చంద్రయాన్‌-2 జ్ఞాపకాలను చెరిపేసి.. చరిత్ర సృష్టించి..

Chandrayaan-3 Success: చంద్రయాన్‌-2 జ్ఞాపకాలను చెరిపేసి.. చరిత్ర సృష్టించి..
X

దేశమంతా ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోంది.. చంద్రయాన్-3. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టే ఆ అద్భుత క్షణం కోసం ప్రపంచంలోని ప్రతి భారతీయుడు ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరికి దానికి తెరపడి.. మన చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. ఈ విజయం ఊరికే వచ్చిందేం కాదు. 2019లో చంద్రయాన్-2 ఫెయిల్యూర్ తర్వాత ఇస్రో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంది. ఈ మిషన్ సక్సెస్ కోసం నాలుగేళ్లపాటు అహర్నిశలు శ్రమించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో కేంద్రానికే పరిమితమై నాలుగు సంవత్సరాలుగా పగలు, రాత్రి, పండగలు అనే తేడా లేకుండా కష్టపడ్డారు. ఇంతకాలం తమ ఆశ, ప్రతి శ్వాస చంద్రయాన్ గా జీవించారు.

నాలుగేళ్ల ముందు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-2’.. విక్రమ్ ల్యాండర్ సాంకేతిక లోపం వల్ల క్రాష్ అయింది. చంద్రుడి ఉపరితలంపైకి మరొక నిమిషంలో చేరుకోబోతోందనే సమయంలో సిగ్నల్ ఆగిపోయాయి. జాబిల్లికి విక్రమ్ ల్యాండర్‌కు మధ్య గల దూరం 2.1 కిలోమీటర్లు ఉందనగా సమస్య మొదలైంది. విక్రమ్ ల్యాండర్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాకపోవడంతో జాబిల్లిపై దిగనున్న ల్యాండర్ నిలిచిపోయింది. చంద్రుడపైకి చేరుకునేందుకు ‘రఫ్ బ్రేకింగ్’ దశ, ‘ఫైన్ బ్రేకింగ్’ దశ విజయవంతంగా ముగిసినప్పటికీ మరొక నిమిషం ఉందనగా మిషన్ నిలిచిపోయింది. ఆ టైంలో ఇస్రో చైర్మన్ గా ఉన్న కె.శివన్ కంటతడిపెట్టుకున్నారు. ఆయనను ప్రధాని ఓదార్చిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ ఫెయిల్యూర్ ను తలదన్నేలా.. కొత్త చరిత్ర లిఖిస్తూ నాలుగేళ్ల శాస్త్రవేత్తల కష్టం నేడు సాకారమైంది. ప్రపంచ దేశాలు సైతం అవాక్కయ్యేలా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి భారత్ చరిత్ర సృష్టించింది.

Updated : 23 Aug 2023 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top