Home > టెక్నాలజీ > మార్కెట్లోకి వచ్చేసిన టాటా ఎలక్ట్రిక్ సైకిల్

మార్కెట్లోకి వచ్చేసిన టాటా ఎలక్ట్రిక్ సైకిల్

మార్కెట్లోకి వచ్చేసిన టాటా ఎలక్ట్రిక్ సైకిల్
X

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హవా. కార్లు, బైకులు ఇలా అన్నీ ఈవీలవి కొనుక్కోవడానికి ఇంటస్ట్ చూపిస్తున్నారు జనాలు. పర్యావరణ కాలుష్యానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ తోడ్పడుతున్నాయి. అందుకే ఈ తరహాలో సైకిళ్ళను కూడా తీసుకొస్తున్నాయి చాలా కంపెనీలు.

టాటా స్ట్రైడర్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్టిక్ సైకిల్ ను విడుదల చేసింది. జీటా ప్లస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ సైకిల్ ధర 26,995 రూ నుంచి ప్రారంభం అవుతోంది. అి కూడా కొంతకాలమే అని చెబుతోంది కంపెనీ. ఈ ధర లాంచింగ్ ఆఫర్ లో వస్తోంది. తరువాత దాని రేటు పెరుగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దీని ధర 6వేలు పెరిగిన 32వేల, 995రూ అవుతుంది.

ఈ సైకిల్ ను టాటా స్ట్రైడర్ అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చును. దీనిలో 250W BLDC మోటార్ ను వినియోగించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. ఇందులో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ ఫిక్స్ చేశారు. జీటా ప్లస్ సైకిల్ 216WH పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. దీని వేగం గంటకు 25 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కు డ్యూయల్ బ్రేక్ లు ఉంటాయి.

Updated : 17 July 2023 6:16 PM IST
Tags:    
Next Story
Share it
Top