iPhone 15 price: ఐఫోన్ 15తో పాటు.. ఏం ఏం రాబోతున్నాయంటే?
X
ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ ‘వండర్ లస్ట్’ వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 12) కాలిఫోర్నియాలో జరిగే ఈ ఈవెంట్ లో.. ఐఫోన్ 15 సిరీస్ తో పాటు, మరికొన్ని గ్యాడ్జెట్స్ ను లాంచ్ చేయనుంది. ఇదివరకు విడుదలైన సిరీస్ లకు కాస్త భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానుంది. ఈసారి యూజర్లకు ఉపయోగపడే ఫీచర్లతో పాటు.. స్టోరేజ్ ను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఐఫోన్ 15,15 ప్లస్,15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేయనున్నారు. అంతేకాకుండా యాపిల్ మార్క్ లైటెనింగ్ పోర్ట్ (చార్జింగ్ పోర్ట్)కు బదులుగా టైప్ సీ పోర్ట్ ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా అందిస్తారని లీక్స్ ద్వారా తెలుస్తుంది.
వీటితో పాటు యాపిల్ ఐఓఎస్ 17, ఐప్యాడ్‌ఓఎస్ 17, మ్యాక్ ఓఎస్ 14, టీవీఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10, మ్యాక్ ఓఎస్ సోనోమా లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ గురించి కూడా ఈ ఈవెంట్ లో ప్రకటించే అవకాశం ఉంది. యాపిల వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ సిరీస్ అల్ట్రా 9 కూడా తీసుకొస్తున్నారు. ఐఫోనే కాకుండా ఎయిర్ పాడ్స్ లోనూ టైప్ సీ పోర్ట్ ఉండనుంది. కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు) ఈ ఈవెంట్ జరగనుంది. కాగా లీక్స్ ప్రకారం ఐఫోన్ 15 ప్రారంభ ధర భారత్ లో రూ.79,900, ఐఫోన్ 15 ప్లస్ ధర్ రూ.89,900 వరకు ఉంటుందని తెలుస్తుంది.