భారత్ లో త్వరలోనే టెస్లా కార్లు
X
కార్లలో టాప్ బ్రాండ్...ఒక సంచలనం టెస్లా త్వరలోనే భారత్ కు రానుంది. ఇక్కడే తయారీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ అనుకుంటోంది. మొట్టమొదటగా టెస్లా ఈవీలను అమ్మాలని ప్లాన్ చేస్తోంది.
వీలైనంత తొందరగా బారత్ లో తమ కార్లు అమ్మాలని అనుకుంటోంది ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా. కార్ల ఫ్యాక్టరీ కోసం భారత్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన్టుల జాతీయ మీడియా చెబుతోంది. ఏటా 5 లక్షల ఈవీ కార్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కంపెనీ చూస్తోంది. ఇందులో ఉత్పత్తి చేసిన కార్లను ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు భారత్ నుంచే ఎగుమతి చేయాలని కంపెనీ ప్రణాళికలు వేస్తోంది.
మరోవైపు భారత్ టెస్లా కార్ల అమ్మకాన్ని ప్రారంభించాలని కూడా అనుకుంటోంది. టెస్లా ఈవీ కార్ల ప్రారంభ ధర 20 లక్షల నుంచి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తల మీద టెస్లా ఏమీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ గత నెల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన లో ఎలాన్ మస్క్ ను కలిసినప్పుడు....ఆయన తన సంస్థ కార్యకలాపాలు భారత్ లో వీలైనంత తొందరగా ప్రారంభమవుతాయని తెలిపారు.
భారత్ లోకి టెస్లా కార్లను ప్రవేశం ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ భారత్ కార్ల మీద భారీ ఎత్తున సుంకం విధిస్తుండడంతో ఇప్పటి వరకు అది మొదలవలేదు. దాని బదులుగా ఇక్కడే తయారీ చేపడితే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని, కార్లకూ డిమాండ్ ఉంటుందని టెస్లా కంపెనీ భావిస్తోంది. అది ఇప్పుడు త్వరలోనే కార్యరూపం దాల్చనుందని తెలుస్తోంది.