రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్లు ఇవే
X
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైన సాధనం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకూ స్మార్ట్ ఫోన్ అనేది వారి జీవితంలో భాగమై పోయింది. అయితే ఇలాంటి స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వేలాదిగా విడుదలవుతూ ఉంటాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సరికొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను రియల్‌మీ కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తోంది.
రియల్‌మీ నార్జో 70 ప్రో అనే పేరుతో సరికొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. వచ్చే నెలలోనే ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. గతంలో విడుదల చేసిన రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఈ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది. అయితే మార్చిలో ఏ తేదీలో ఫోన్‌ను రిలీజ్ చేయనున్నారనే విషయంపై కంపెనీ ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్మార్ట్ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ సరికొత్త మోడల్ ఫోన్‌లో సెంట్రల్లీ కెమెరా మాడ్యూల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) టెక్నాలజీని అందిస్తున్నారు. అలాగే ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ కూడా ఉంది. 64 మెగా పిక్సెల్స్‌తో ఓమ్నీ విజన్ ఓవీ64బీ టెలిఫోటో కెమెరాను కూడా అమర్చారు. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందిస్తున్నారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తున్నారు. 6.7 ఇంచెస్‌తో ఉండే ఈ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. అలాగే ఇందులో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా ఉంది. అయితే ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.