ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే..
X
మరో రెండు వారాల్లో 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ సందర్భంగా ఇంటర్నెట్‌లో అత్యధిక మంది భారతీయులు వెతికిన అంశాలను గూగుల్ విడుదల చేసింది. వీటిలో న్యూస్, ఎంటర్ టైన్మెంట్, మీమ్స్, ట్రావెల్, రిసిపీస్ ఇతర కేటగిరీలున్నాయి. అత్యధిక మంది సర్చ్ చేసిన అంశం చంద్రయాన్ 3 ప్రయోగం. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. చంద్ర మండలంలోని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపి భారత్ చరిత్ర సృష్టించింది. సెర్చింగ్‌లో టాప్ 10లో నిలిచిన అంశాలు.
1. చంద్రయాన్
2.కర్నాటక ఎన్నికలు
3.ఇజ్రాయిల్, పాలస్తీనా ఘర్షణలు
4. సతీష్ కౌశిక్(బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత)
5. బడ్జెట్ 2023
6.టర్కీ భూకంపం
7.అతీఖ్ అహ్మద్ (యూపీ గూండా)
8. మ్యాథ్యూ పెర్రీ (హాలీవుడ్ నటుడు)
9. మణిపూర్ ఘర్షణలు
10. ఒడిశా రైలు ప్రమాదం
ఆశ్చర్యమేంటంటే అక్టోబర్ 7 తర్వాత మొదలైన ఇజ్రాయిల్, హమాస్ ఘర్షణ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. నటుడు, దర్శకుడు సతీష్ కౌషిక్, ‘ఫ్రెండ్స్’ స్టార్ మ్యాథ్యూ పెర్రీ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఒక న్యూస్ కు, సంఘటనలకు సంబంధించి 2023 లో భారతీయులు ఎక్కువగా ఇంటర్నెట్ లో సర్చ్ చేసిన క్వశ్చన్స్ ను కూడా గూగుల్ విడుదల చేసింది. వీటిలో చాట్ జీపీటీ, ఇన్ స్టాగ్రామ్, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అంశాలున్నాయి. ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్వశ్చన్స్ లో
1. జీ 20 అంటే ఏమిటి?
2. యూసీసీ అంటే ఏంటి?
3. చాట్ జీపీటీ అంటే ఏంటి?
4. హమాస్ అంటే ఏంటి?
5. 28 సెప్టెంబర్ 2023 అంటే ఏంటి?
6. చంద్రయాన్ 3 అంటే ఏంటి?
7. ఇన్ స్టా గ్రామ్‌లో త్రెడ్స్ అంటే ఏంటి?
8. క్రికెట్ లో టైమ్ డ్ అవుట్ అంటే ఏంటి?
9. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి?
10.సెంగోల్ అంటే ఏంటి?
ఇక ‘ఏ విధంగా’(How) అనే జాబితాలో ఎక్కువ మంది ఈ కిందివాటిని వెతికారు.
1. అతినీలలోహిత కిరణాల నుంచి శరీరాన్ని, జుట్టును రక్షించుకోవడానికి ఇంట్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి?
2. యూట్యూబ్‌లో మొదటి 5 వేల మంది ఫాలోయర్స్ ను చేరుకోవడం ఎలా?
3. కబడ్డీ మంచిగా ఆడడం ఎలా?
4. కారు మైలేజీని పెంచుకోవడం ఎలా?
5. చెస్ గ్రాండ్ మాస్టర్ కావడం ఎలా?
6. రక్షాబంధన్ రోజు నా సోదరిని సర్ ప్రైజ్ చేయడం ఎలా?
7. కంజీవరం ప్యూర్ సిల్క్‌ను గుర్తించేది ఎలా?
8.ఆధార్ కార్డుతో ప్యాన్ కార్డును ఎలా లింక్ చేయాలి?
9. వాట్సాప్ చానల్‌ను ఎలా క్రియేట్ చేయాలి?
10. ఇన్‌స్టా గ్రామ్‌లో బ్లూటిక్ ఎలా సాధించాలి?
స్పోర్స్ట్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన అంశాలు..
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్
2. క్రికెట్ వరల్డ్ కప్
3. ఆసియా కప్
4. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
5. ఏషియన్ గేమ్స్
6. ఇండియన్ సూపర్ లీగ్
7. పాకిస్తాన్ సూపర్ లీగ్
8. ద యాషెస్
9. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్
10. ఎస్ ఏ 20