పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం
X
పసిడి ప్రియులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.60,00 వేలకు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 కి ఎగబాకి రూ. 55,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2500 పెరిగి రూ. 79,500 గా నమోదు అయింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఆషాఢ మాసం కొనసాగుతున్న క్రమంలో.. రాబోయే శ్రావణ మాసం పెళ్లిళ్లు , శుభకార్యాల సీజన్ కాబట్టి బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ బంగారం ధరలు అమాంతం పెరిగాయి. వెండి ధరలు సైతం పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇక రాబోయే కాలంలో పెళ్లి ముహూర్తాలు ఇప్పటికే నిశ్చయించుకున్నవారు కాస్త తొందరపడితే మంచిది. లేదంటే తాజా రేట్లు మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు. తప్పనిసరి కాబట్టి ముందే మేల్కొంటే కాస్త ఖర్చు కలసి రావొచ్చు.
ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే... పైన తెలిపిన బంగారం ధరలకు మళ్లీ అదనంగా జీఎస్‌టీ , తయారీ చార్జీలు ఉంటాయి. వీటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి. అందువల్ల మహిళామణులు.. కాస్త నగల కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోల్డ్ జువెలరీ ఆధారంగా తయారీ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దూసుకు పోతున్నాయి. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.18 శాతం మేర పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1965 డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. 0.42 శాతం పైకి ఎగసింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 24.41 డాలర్లకు ఎగసింది.