Home > టెక్నాలజీ > మస్క్ మామకు యూజర్ల షాక్... బ్లూ స్కైకి పోటెత్తారు..

మస్క్ మామకు యూజర్ల షాక్... బ్లూ స్కైకి పోటెత్తారు..

మస్క్ మామకు యూజర్ల షాక్... బ్లూ స్కైకి పోటెత్తారు..
X

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ నిర్వహణపై ఇంకా పట్టుసాధించకపోగా తీసుకున్న నిర్ణయాలు కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ట్విటర్ యూజర్ల నుంచి డబ్బులు పిండడమే కాక, చదివే పోస్టులకు కూడా తాజాగా పరిమితి విధించి చేతులు కాల్చుకుంటున్నాడు. ఆయా కేటగిరీల యూజర్లు ఇకపై పరిమిత సంఖ్యలో పోస్ట్ చదవాల్సి ఉండడంతో జనం వేరే ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ట్విటర్ మాజీ కోఫౌండర్ జాక్ డోర్సే సారథ్యంలోని మరో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ‘బ్లూస్కై’కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బ్లూ స్కై యాప్ ఇన్‌స్టలేషన్లు భారీగా పెరగడంతో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. బ్లూ స్కై ఆల్ ట్రాఫిక్ ఆల్ లైమ్ రికార్డుకు చేరుకుందని, తాము అందర్నీ ఆహ్వానిస్తామని డోర్సే తెలిపారు.

మస్క్ మామ లిమిట్స్

ట్విటర్ యూజర్లు ఇకపై పరిమిత సంఖ్యలో ట్వీట్లు చదివేలా మస్క్ కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. బ్లూ టిక్ యూజర్లు ఒక రోజులో 10000 పోస్ట్‌లు, అన్‌వెరిఫైడ్ యూజర్లు 1000 పోస్టులు, కొత్త యూజర్లు 500 పోస్ట్‌లను మాత్రమే చదివే వీలుంది. ట్విట్టర్‌ ఖాతా లేకపోతే యాక్సెసే ఉండదు. దీంతో లక్షల మంది బ్లూస్కైకి మళ్లారు. మస్క్ ట్విటర్‌ను కొన్నాక బ్లూస్కైకి ఆదరణ పెరుగుతోంది. కొత్త యూజర్లు వరదలా వెల్లువెత్తడంతో కొత్త సైన్ ఇన్లను నిలిపేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, కొత్త వాళ్లకు స్వాగతమని కంపెనీ తెలిపింది.


Updated : 2 July 2023 9:02 PM IST
Tags:    
Next Story
Share it
Top