Home > టెక్నాలజీ > ఈ యాప్తో ఫోన్లోనే థర్మామీటర్.. ఏం చేయాలంటే..!

ఈ యాప్తో ఫోన్లోనే థర్మామీటర్.. ఏం చేయాలంటే..!

ఈ యాప్తో ఫోన్లోనే థర్మామీటర్.. ఏం చేయాలంటే..!
X

ఒకప్పుడు ఫోన్ కాల్స్ కే పరిమితమైన మొబైల్ ఫోన్.. ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అర చేతిలో ప్రపంచాన్ని చూస్తే స్థాయికి ఎదిగింది. రోజుకో కొత్త టెక్నాలజీతో మొబైల్ ఫోన్.. అన్ని గ్యాడ్జెట్స్ ను పక్కకు నెడుతుంది. రోజురోజుకు కొత్త రూపాన్ని పొందుతుంది. ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి రానుంది. మొబైల్ ఫోన్ తర్వరలో జ్వరాన్ని కొలిచే థర్మామీటర్ అవతారాన్ని ఎత్తనుంది. దానికోసం ఓ యాప్ రూపుదిద్దుకుంటోంది.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఫీవర్ యాప్ పేరులో ఓ కొత్త యాప్ ను తయారుచేసే పనిలో పడ్డారు. ఫోన్ లో టచ్ స్క్రీన్, బ్యాటరీ టెంపరేచర్ ను కనుకునేందుకు ఉపయోగపడే సెన్సర్ల సాయంతో ఈ యాప్ పనిచేస్తుంది. ఆ సెన్సర్ల సాయంతో బాడీ టెంపరేచర్ ను కొలిచి మెషిన్ లెర్నింగ్ సాయంతో థర్మామీటర్ లా సాయపడుతుంది. అయితే, ఇందులో ప్రత్యేకంగా ఎలాంటి అదనపు సాఫ్ట్ వేర్ వాడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ యాప్ ను ఎలా వాడాలంటే.. జ్వరం ఉన్న వ్యక్తికి నుదిటికి కొంత దూరంగా మొబైల్ ను ఉంచి.. కెమెరా సాయంతో టెంపరేచర్ ను తెలుసుకోవచ్చు. కేవలం 90 సెకన్లలోనే ఈ యాప్ రిజల్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ యాప్ తో దాదాపు 37 మందిపై ప్రయోగించారు. వాళ్లలో 95శాతం కరెక్ట్ రిజల్ట్ చూపించింది. కావాల్సిన మెడికల్ క్లియరెన్స్ లన్నీ తీసుకున్న తర్వాత మార్కెట్లోకి యాప్ ను విడుదల చేస్తారు.


Updated : 24 Jun 2023 4:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top