Home > టెక్నాలజీ > లాయర్ దెబ్బకు ఫేస్‌బుక్‌పై 41 లక్షల ఫైన్

లాయర్ దెబ్బకు ఫేస్‌బుక్‌పై 41 లక్షల ఫైన్

లాయర్ దెబ్బకు ఫేస్‌బుక్‌పై 41 లక్షల ఫైన్
X

ఫేస్ బుక్.. ప్రపంచవ్యాప్తంగా 2.85 బిలియన్ యూజర్స్ను కలిగివున్న అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. రూల్స్ బ్రేక్ చేస్తే యూజర్స్ అకౌంట్ను బ్లాక్ చేస్తుంది ఈ సంస్థ. అయితే ఓ వ్యక్తి తన అకౌంట్ బ్లాక్ చేయడంపై కోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టు మెటాకు భారీ ఫైన్ విధించింది.

అమెరికాలోని జార్జియాకు చెందిన జాసన్ క్రాఫోర్డ్ అనే లాయర్ ఫేస్‌బుక్‌ కంపెనీకే చెమటలు పట్టించాడు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్ యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో సంస్థ మీద కేసుపెట్టాడు. సరైన కారణం చెప్పకుండా తన ఖాతాను టెర్మినేట్ చేయడంతో పాటు, సమస్యపై స్పందన కూడా లేకపోవడంతో 2022లో అతను ఈ కేసు పెట్టాడు. దీనికి మెటా నుంచి సమాధానం లేకపోవడంతో కోర్టు 50వేల డాలర్లు అంటే 41 లక్షల ఫైన్ విధించింది.

‘‘ఒక రోజు ఉదయాన్నే లేచి ఫేస్ బుక్ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయింది. నన్ను బ్యాన్ చేసినట్లు తెలిసింది. చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కారణంగా నన్ను లాక్ చేసినట్లు చిన్న స్నాప్‌షాట్ ద్వారా తెలిపారు. తర్వాత అది కూడా పోయింది. కానీ నేను ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతో ప్రయత్నించా. కానీ ఫేస్ బుక్ నుంచి ఎటువంటి ప్రయెజనం లేదు’’ అని క్రాఫోర్డ్ తెలిపారు. కనీసం తాను ఏం తప్పు చేశానో తెలపకపోవడంతోనే కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.

Updated : 18 Jun 2023 3:54 PM IST
Tags:    
Next Story
Share it
Top